ఒకప్పుడు ఉద్యమ పార్టీగా ఉన్న టిఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీ బారాసాగా మారి దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే ….బారసా పార్టీ ( BRS party )ఈ స్థాయిలో విజయం సాధించడానికి మొదటి ఐదు కారణాలలో వారి మీడియా మేనేజ్మెంట్ కూడా ఒకటి అని చెప్పవచ్చు ….
తెలంగాణ ఉద్యమ సమయంలో మెజారిటీ జర్నలిస్టులను( Journalist ) తమ పార్టీకి అనుకూలంగా పనిచేసేలా చేయడంలో కేసీఆర్( CM KCR ) విజయవంతం అయ్యారని చెప్పవచ్చు .తమ పార్టీ అధికారంలోకి వస్తే విలేకరులకు ఇళ్ల స్థలాల తోపాటు డబుల్ బెడ్ రూమ్ ఇల్లులు కట్టించి ఇస్తామని, ఆరోగ్య భీమాను అమలు చేస్తామని, ప్రత్యేక పథకాలను తీసుకొస్తామని ఇలా అనేక హామీలు ఇచ్చారు .
అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందులో చాలా హామీలను నెరవేర్చలేదు .తమకు అనుకూలంగా ఉన్న కొంతమంది జర్నలిస్టులకు మాత్రం కొన్ని పదవులు ఇచ్చి తమపై వ్యతిరేకత రాకుండా మేనేజ్ చేయగలిగారు అన్న వార్తలు వచ్చాయి .తన అవసరం కోసం ఎవరిని ఎలా వాడుకోవాలో అద్భుతంగా తెలిసిన కేసీఆర్ .తమకు అడ్డొచ్చే వారిని నేర్పుగా పక్కన పెట్టడం కూడా తెలుసు .ఢిల్లీ పీఠం మీద గురిపెట్టిన కేసీఆర్ కు ఇప్పుడు జాతీయస్థాయి విలేకరుల అవసరం పడింది మహారాష్ట్ర( Maharashtra )లో ఇప్పటివరకు జరిగిన మూడు సభలు సక్సెస్ అవ్వడం వెనక మీడియా మిత్రులకు ఇచ్చిన నజరాణాలు భారీ స్థాయిలో ఉండటమే కారణం అంటూ వార్తలు వస్తున్నాయి.
దాదాపు 5 కోట్ల రూపాయలు విలువైన యాడ్సను మహారాష్ట్రలో ఉన్న ప్రధాన పత్రికలు అన్నిటికీ ఇచ్చారని అందువల్ల బారసా పార్టీకి సంబంధించిన చిన్న చిన్న ప్రెస్ మీట్లను సైతం మొదటి పేజీలో వచ్చేలా ఆ పత్రికలు జాగ్రత్తలు తీసుకున్నాయని చెబుతున్నారు.
అంతేకాకుండా సభలను కవర్ చేయడానికి వచ్చే జర్నలిస్టులకు వారి మీడియా పాపులారిటీ పత్రిక సర్కులేషన్స్ బట్టి ఐదు వేల నుంచి 25 వేల రూపాయల వరకు ముట్ట చెప్పారని .అతిధి మర్యాదలు కూడా ఘనంగా చేశారని ఇప్పటివరకు ఏ పార్టీ నుంచి అలాంటి మర్యాదలు చూడని జర్నలిస్టులు బారసా పార్టీ పట్ల ప్రత్యేక అభిమానం చూపిస్తున్నారని దాని ఫలితం గానే ఆ పార్టీ పట్ల మహారాష్ట్ర అంతటా అనుకూల వార్తల ప్రసారం అవుతున్నాయని తెలుస్తుంది
.