బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు.గతంలో ప్రతి హిందూ జంట,ఐదుగురు పిల్లల్ని కనాలని,హిందుత్వాన్ని రక్షించుకోవాలంటే అలా చేయక తప్పదు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సురేంద్ర సింగ్ ఈ సారి కూడా అలంటి వ్యాఖ్యలే చేసి మరోసారి వార్తల్లో నిలిచారు.
ఉత్తరప్రదేశ్‌లోని బాలియా నియోజకవర్గానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ ముస్లిం లపై సంచలన వ్యాఖ్యలు చేసారు.ముస్లింలకు పదుల సంఖ్యలో భార్యలు ఉంటారని.
వేల సంఖ్యలో పిల్లలను కంటారంటూ వ్యాఖ్యానించి ఆయన మరోసారి వివాదాలకు తెరతీశారు.అంతేకాకుండా ముస్లింలు ఇలా చేయడం సాంప్రదాయం కాదు, జంతు ధోరణిని ముస్లింలు అవలంభిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సుమారు 50 మంది భార్యలను కలిగి ఉండి.1050 మంది పిల్లలకు జన్మనిస్తారని సురేంద్ర సింగ్ వ్యాఖ్యలు చేశారు.చివరిగా సమాజంలో కేవలం ఇద్దరి నుంచి నలుగురిని మాత్రమే కనాలి అంటూ ఆయన సూచించారు.ఆయన ఈ విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి ఏమి కాదు గతంలో కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.