చాలామందికి ఎప్పుడు మద్యం తాగాలో, ఎప్పుడు తాగకూడదో తెలియదు.మద్యం విషయంలో చాలామందికి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు.
మద్యం మత్తులో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు.దానికి ఉదాహరణగా ఒక మహిళ నిలుస్తుంది.
ఆమె మద్యం తాగి, తనకు తెలియకుండా విమాన టిక్కెట్ కొనుగోలు చేసింది.తర్వాత ఈ విషయం తెలుసుకుని ఆమె అవాక్కయింది.
అలాంటి పొరపాట్లు చేయడం కొత్తేమీ కాదు.కానీ, ఆ విమాన టిక్కెట్( Flight ticket ) విషయంలో ఆమెకు తెలిసిన కొన్ని విషయాలు షాక్‌కి గురిచేశాయి.
ఆమెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారింది.
ఆ వీడియోలో, ఒక యువతి విమానంలో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉంది.ఆమె ముఖం మీద కొంచెం గందరగోళం కనిపిస్తుంది. కెప్టెన్ విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరికీ హిందీలో ఏదో చెబుతున్నారు.
ఆయన చెప్పిన మాటలు వినగానే ఆ యువతి మరింత ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది.ఆ వీడియోలో ఈ దృశ్యాన్ని చూస్తున్న వారికి అర్థమయ్యేలా ఒక వాక్యం రాసి ఉంది.ఆ వాక్యం “నువ్వు మద్యం తాగి, జార్జియాకు విమాన టిక్కెట్ బుక్ చేశావు… కానీ ఇప్పుడు విమానం ఎక్కి, భారతదేశానికి వెళ్తున్నావు అని తెలుసుకున్నావు.” అని రాసి ఉంది.
అంటే, ఆ యువతి మద్యం తాగి ఉన్నప్పుడు జార్జియాకు( Georgia ) వెళ్లాలని అనుకుని ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేసింది.కానీ, ఆమెకు తెలియకుండా ఆ టిక్కెట్ భారతదేశానికి వెళ్లే విమానం కోసం బుక్ చేయబడింది.ఇప్పుడు విమానంలో కూర్చొని ఆమెకు ఈ విషయం తెలిసి షాక్ అయింది.ఆ వీడియోను 3000 మందికి పైగా లైక్ చేశారు.3 లక్షలకు పైగా మంది చూశారు.“మద్యం తాగిన వాళ్ళు విమానం ఎక్కడానికి అనుమతి ఉందా?” అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.అదే సమయంలో, భారతదేశంలో తాను వెళ్లవచ్చే ప్రదేశాల గురించి ఆ యువతికి చాలామంది సలహాలు ఇస్తున్నారు.మాత్రం మరీ ఇంత కేర్ లెస్ గా ఎలా ప్రవర్తిస్తారు అని ప్రశ్నిస్తున్నారు.
ఈ వీడియో సరదా కోసం వేసినది కావచ్చు అని మరి కొంతమంది పేర్కొన్నారు.దీనిని మీరు కూడా చూసేయండి.