స్కూటర్‌ను రెక్‌లెస్‌గా నడిపిన యువతి.. కింద పడ్డాక ఏం చేసిందో చూస్తే నవ్వాగదు..?

సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోలో స్కూటీ మీద వెళ్తున్న ఓ యువతికి, ఓ యూట్యూబర్‌కి మధ్య చిన్న తగాదా జరిగింది.

 What Did The Young Woman Who Rode The Scooter Recklessly Do When She Fell Down,-TeluguStop.com

రోడ్డు మీద వాహనాలు ఎక్కువగా ఉన్న సమయంలో జరిగిన ఈ సంఘటన చాలా ఫన్నీగా అనిపించింది, అదే సమయంలో ప్రమాదకరంగా కూడా ఉంది.ఈ వీడియోను ‘ఘర్ కా కలేష్’ ( Ghar Ka Kalesh )అనే ట్విట్టర్ యూజర్ పంచుకున్నారు.

ఈ వీడియోలో ఒక అమ్మాయి స్కూటీని( a scooty ) చాలా రెక్‌లెస్‌గా నడుపుతోంది.రోడ్డుపై స్కూటీని ఇష్టమొచ్చినట్లు తిప్పేస్తూ తడబడుతూ వెళ్తుంది.చివరికి స్కూటీని నియంత్రించలేక పోయి రోడ్డు మీద పడిపోతుంది.అప్పుడు ఆమె వెనుక వస్తున్న ఒక మోటర్‌సైకిలిస్ట్‌ ( A motorcyclist )ఈ దృశ్యాన్ని తన మొబైల్‌తో రికార్డ్ చేస్తున్నాడు.

ఈ విషయంపై ఆ అమ్మాయి ఆ వ్యక్తితో గొడవ పడుతోంది.అతనే తనను పడవేశాడని నింద వేస్తూ షాక్ ఇచ్చింది.

తాను ఏం చేయకపోయినా తప్పు బట్టడంతో సదరు యూట్యూబర్ కంగుతిన్నాడు.

ఆమె అంటున్నది ఏంటంటే, ఆ వ్యక్తి తనను వెనుక నుంచి ఫాలో అవుతూ, అకస్మాత్తుగా తన ఎడమవైపు తిరిగినప్పుడు కూడా తనకు అడ్డుగా ఉన్నాడని.కానీ, ఆ వ్యక్తి ఈ విషయాన్ని చాలా ప్రశాంతంగా వివరించినా ఆ అమ్మాయి వినలేదు.అక్కడ గుమిగూడిన జనమంతా ఆ అమ్మాయి మాటనే నమ్మి ఆ వ్యక్తిని తప్పు పడుతున్నారు.

కానీ, ఆ అమ్మాయి చెప్పేది నిజమే అని నిరూపించేలా ఎలాంటి ఆధారాలు లేవు.

ఈ వీడియో చూసిన ప్రజలు రెండు రకాలుగా స్పందిస్తున్నారు.కొంతమంది ఆ అమ్మాయిని తప్పు పడుతున్నారు.ఆమె ఎందుకు ఇంత కోపంగా ఉంది అని ప్రశ్నిస్తున్నారు.

అలాగే, ఎలాంటి ఆధారాలు లేకుండా వీడియో తీసిన వ్యక్తిని తప్పు పడుతున్న వారిని కూడా విమర్శిస్తున్నారు.మరోవైపు, కొంతమంది రోడ్డు భద్రత గురించి మాట్లాడుతున్నారు.

అలాగే రోడ్డు మీద ప్రవర్తించే విధానం గురించి చర్చిస్తున్నారు.వీడియో తీసిన వ్యక్తి చాలా ప్రశాంతంగా వ్యవహరించాడని, అతనిని సమర్థిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube