చికాగో: రైల్వే ట్రాక్స్‌పై ఎగజిమ్ముతున్న మంటలు.. ఆ సమస్యకు సొల్యూషన్ అట..?

చికాగోలోని రైల్వే ట్రాక్‌ల( Railway tracks in Chicago ) మీద మంటలు ఎగజిమ్ముతున్నాయి.ఈ వింత దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

 The Fire That Is Burning On The Chicago Railway Tracks Is The Solution To That P-TeluguStop.com

ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లక్షల మంది ప్రయాణించే ట్రాక్స్‌పై మంటలు రేగడం ఏంటి? అని ప్రశ్న వేస్తున్నారు.ఈ వీడియోను @barefactsofficial అనే ఖాతా మొదట పోస్ట్ చేసింది.

అందులో చికాగోలోని రైల్వే ట్రాక్‌ల మీద చిన్న చిన్న మంటలను పుట్టడం చూడవచ్చు.అయితే ఇవి యాక్సిడెంటల్‌గా చెలరేగిన మంటలు ఏమీ కావు.

కావాలనే మంటలు పెట్టారు.దీని వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉందని వీడియోలో చెప్పారు.

చలికాలంలో రైళ్లు పట్టాలు తప్పి వెళ్లకుండా ఉండటానికే ఇలా చేస్తున్నారట! రైల్వే ట్రాక్‌ల మీద మంటలు పెట్టడం వల్ల రైళ్లు ఎలా సురక్షితంగా ప్రయాణిస్తాయి అనేది తెలుసుకుందాం.

చలికాలంలో, ముఖ్యంగా ఉత్తర దేశాల్లో రైల్వే ట్రాక్‌ల మీద మంచు పేరుకుపోవడం చాలా కామన్.

ఈ మంచు వల్ల రైళ్లు ఒక ట్రాక్‌ నుంచి మరో ట్రాక్‌కు మారే చోట (స్విచ్‌లు అంటారు) సమస్యలు వస్తాయి.మంచు కారణంగా ఈ స్విచ్‌లు సరిగ్గా పని చేయకపోవడం వల్ల రైళ్లు ఆగిపోయే ప్రమాదం ఉంది.

అంతేకాకుండా, కొన్నిసార్లు రైళ్లు పట్టాలు తప్పి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది.

అందుకే ఈ సమస్యను నివారించడానికి రైల్వే అధికారులు( Railway officials ) ట్రాక్‌ల మీద చిన్న చిన్న మంటలు వేస్తారు.ఈ మంటలు మంచును కరిగించి, స్విచ్‌లు సరిగ్గా పని చేసేలా చేస్తాయి.దీని వల్ల రైళ్లు సురక్షితంగా తమ గమ్యస్థానాన్ని చేరుకుంటాయి.

రైల్వే ట్రాక్‌ల మీద మంచు పేరుకుపోకుండా ఉండటానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని ఉపయోగిస్తారు.రైల్వే ట్రాక్‌ల వెంట వేరు వేరు చోట్ల గ్యాస్ స్టవ్‌ల లాంటి హీటర్‌లను ఉంచుతారు.

ఈ హీటర్‌లకు నిప్పు పెట్టి మంటను కొనసాగిస్తే, ట్రాక్‌ల మీద పడిన మంచు కరిగిపోతుంది.వీడియోలో కనిపించే చిన్న మంటలు ఈ హీటర్లకు ఇంధనంగా ఉపయోగపడతాయి.

ఈ మంటలు రైళ్లకు ఏమాత్రం ప్రమాదం కలిగించవు.రైల్వే ట్రాక్‌లను అలా రూపొందించారు, రైళ్లు ఈ మంటల మీద నుండి వెళ్లినా ఏమీ జరగదు.రైళ్లు తమ సాధారణ వేగంతోనే ప్రయాణించవచ్చు.చలిగా ఉన్నప్పుడు ట్రైన్లు ఒక ట్రాక్‌ నుంచి మరో ట్రాక్‌కు మారే చోట మంచు పేరుకుపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.

అందుకే చికాగో నగరంలోని రైల్వే అధికారులు ఈ చక్కటి పరిష్కారం కనుక్కొన్నారు.ఈ విషయం తెలియజేస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఈ వీడియోని ఇప్పటికే 2,47,000 మంది చూశారు.చాలా మంది ఈ వీడియోను చూసి, చలికాలంలో రైళ్లు సక్రమంగా నడవాలంటే ట్రాక్‌ల మీద మంచు ఉండకూడదని అభిప్రాయపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube