బింబిసార సినిమాలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ బ్యాగ్ గ్రౌండ్ ఎంటో తెలుసా?

ఇటీవల కాలంలో చైల్డ్ ఆర్టిస్టులకు మంచి క్రేజ్ ఏర్పడింది.హీరో, హీరోయిన్స్ చిన్ననాటి పాత్రల్లో నటిస్తున్న చైల్డ్ ఆర్టిస్టులకి కొదవ ఏమీ లేదు.

 Do You Know Back Ground Of Bimbisara Child Artist Sridevi,  Bimbisara , Child Ar-TeluguStop.com

అయితే ఒక అడుగు ముందుకేసి చైల్డ్ ఆర్టిస్టుల చుట్టూనే అనేక సినిమాలు కూడా వచ్చాయి.చిన్నపిల్లలతో ఎమోషన్స్ బాగా వర్క్ అవుతాయి కాబట్టి మేకర్స్ ఈ విధంగా ఆలోచిస్తూ వారి చుట్టే కథలని అల్లుతున్నారు.

అంతేకాదు విజయాన్ని కూడా సాధిస్తున్నారు.ఈ విధంగా ఎంతో మంది చిన్నారులు తమ మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో మంచి అవకాశాలను దక్కించుకున్నారు.

కొంతమంది ప్రస్తుతం హీరో, హీరోయిన్స్ గా కూడా సెటిల్ అయినా చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు.

ఇటీవల కాలంలో మనం గమనిస్తే అఖండ సినిమా సైతం పాప సెంటిమెంట్ తో వచ్చి అద్భుతమైన విజయాన్ని బాలకృష్ణ కి అందించింది.

RRR సినిమా

సైతం మల్లి అనే పాత్ర చుట్టే తిరిగిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే.ఇక ఇప్పుడు బింబిసారా సినిమా సైతం ఒక చిన్నారి పాత్ర చుట్టే నడవడంతో ఈ చిన్నారి పైన ప్రస్తుతం టాలీవుడ్ దృష్టి పడింది.

అసలు ఈ సినిమాలో నటించిన ఆ పాప ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకునే పనిలో పడింది సోషల్ మీడియా సైతం.

Telugu Akanga, Bimbisara, Child Artist, Childartist, Kalyan Ram, Rama Rao Duty,

ఇక్ ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కి ఎక్కువ కాంబినేషన్ సీన్స్ లో నటించడంతో ఈ అమ్మాయికి మంచి క్రేజ్ ఏర్పడింది.ఈ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు శ్రీదేవి.బిందుసారా సినిమాలో శాంభవి అనే పాత్రలో నటించి బాగానే మార్కులు సంపాదించుకుంది తన నటనతో.

కళ్యాణ్ రామ్ కి పోటీగా ఈ అమ్మాయి నటించింది అంటే అందులో అతిశయోక్తి లేదు.శ్రీదేవికి ఇదేమీ మొదటి సినిమా కాదు ఇంతకుముందే మేజర్, రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాల్లో సైతం ఈమె కనిపించింది.

Telugu Akanga, Bimbisara, Child Artist, Childartist, Kalyan Ram, Rama Rao Duty,

ప్రేమ, యమలీల, కల్యాణ వైభోగమే వంటి సీరియల్స్ లోనూ నటించి శ్రీదేవి మంచి గుర్తింపుని సంపాదించుకుంది.ఇక శ్రీదేవి తండ్రి శ్రీహరి గౌడ్ సైతం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కావడంతో తన కూతుర్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు.ప్రస్తుతం శ్రీదేవి తండ్రి నటుడు మరియు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.వీరి స్వగ్రామం బేతంచర్ల.సినిమాల కోసమే వీరి కుటుంబం హైదరాబాద్ కి షిఫ్ట్ అయింది.ప్రస్తుతం శ్రీదేవికి మంచి ఆఫర్స్ కూడా వస్తున్నాయి రానున్న కాలంలో ఒక హీరోయిన్ అయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube