మన తెలుగు చిత్ర పరిశ్రమలో( Tollywood Industry ) కొనసాగే హీరోలందరూ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇక మన హీరోలు రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది.
ఇలా మన తెలుగు హీరోలకు ఈ స్థాయిలో క్రేజీ లభించింది అంటే అది కేవలం ప్రేక్షకుల అభిమానం ఆదరణ అని చెప్పాలి.ఇలా వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలు ఏదైనా ఆపద వచ్చింది అంటే వెంటనే స్పందిస్తూ వారికి తోచిన మొత్తంలో విరాళాలు అందిస్తూ అండగా నిలుస్తారు.
కేవలం మన తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి ప్రాంతాలలో విపత్తు జరిగిన వెంటనే స్పందిస్తూ విరాళాలు ప్రకటిస్తూ ఉంటారు.ఇటీవల కేరళలో కొండ చరియలు విరిగిపడటంతో ఎంతోమంది తెలుగు హీరోలు కోట్లలో విరాళం ప్రకటించారు.అయితే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో వరదలు( Floods ) రాష్ట్రాలను అల్లకల్లోలం చేసేసాయి. తెలంగాణలో ( Telangana ) ఖమ్మం ఆంధ్రాలో( Andhrapradesh ) విజయవాడ పూర్తిగా వరదలలో చిక్కుకున్నాయి.
ఈ తరుణంలోనే ఆ ప్రాంత ప్రజలు సాయం కోసం ఎదురుచూస్తున్నారు.ఇక రెండు తెలుగు రాష్ట్రాలు ఇలా వరదలలో చిక్కుకోవడంతో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలందరూ కూడా కోట్లలో విరాళాలు ప్రకటిస్తూ తమ మంచి మనసు చాటుకున్నారు.అయితే ఏపీకి ఇలా పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పటికీ కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ హీరోలు ఏమాత్రం కనికరం చూపలేదు.ఇతర ఇండస్ట్రీలో ఉన్న హీరోల సినిమాలు కూడా తెలుగులో విడుదల అయితే మంచి సక్సెస్ చేస్తారు.
తెలుగు ప్రజలంటే మాకు ఎంతో అభిమానం అని వేదికలపై మాట్లాడే హీరోలు ఇప్పుడు ఆ తెలుగు ప్రేక్షకులు ఇబ్బందులలో ఉంటే హీరోలు మాత్రం మౌనం పాటిస్తున్నారు.దీంతో ఎంతోమంది అభిమానులు ఇతర భాష హీరోలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు కురిపిస్తున్నారు.