ఆకుకూర‌లు ఆరోగ్యానికే కాదు చ‌ర్మానికి ఎన్ని లాభాల‌ను అందిస్తాయో తెలుసా?

ఆకుకూర‌లు.వీటి గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే అవుతుంది.

 Do You Know How Many Benefits Of Greens Have For Skin? Green Vegetables, Greens,-TeluguStop.com

అపార‌మైన పోష‌కాల‌ను క‌లిగి ఉండే ఆకుకూర‌లు ఆరోగ్య ప‌రంగా అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.వివిధ ర‌కాల జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ర‌క్ష‌ణ కూడా క‌ల్పిస్తాయి.

అందుకే నిత్యం ఏదో ఒక ఆకుకూర ఆహారంలో భాగం చేసుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.అయితే ఆకుకూర‌లు ఆరోగ్యానికి మాత్ర‌మే కాదు.

చ‌ర్మ సౌంద‌ర్యానికి ఎన్నో లాభాల‌ను చేకూరుస్తాయి.మ‌రి ఆ లాభాలు ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

చ‌ర్మ స‌మ‌స్య‌ల్లో అత్య‌ధికంగా వేధించే వాటిలో మొటిమ‌లు ముందు వ‌ర‌స‌లో ఉంటాయి.యుక్త వ‌య‌సు ప్రారంభ‌మైన ద‌గ్గ‌ర నుంచీ మొటిమ‌లు త‌ర‌చూ మ‌ద‌న పెడుతూనే ఉంటాయి.అయితే మొటిమ‌లు రాకుండా అడ్డుక‌ట్ట వేయ‌డంలో ఆకుకూర‌లు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.ప్ర‌తి రోజు కాక‌పోయినా వారంలో క‌నీసం మూడు సార్లు ఆకుకూర‌ల‌ను తీసుకుంటే మొటిమ‌లు వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.

అలాగే కొంద‌రు స్కిన్ టోన్‌ను పెంచుకోవ‌డం కోసం తెగ ప్ర‌య‌త్నిస్తుంటారు.ఈ క్ర‌మంలోనే ఖ‌రీదైన క్రీమ్స్ వాడుతుంటారు.

కానీ, క్రీమ్స్ తో ప‌ని లేకుండా ఆకుకూల‌తోనే చ‌ర్మ ఛాయ‌ను పెంచుకోవ‌చ్చు.అవును, నిత్యం ఏదో ఒక ఆకుకూర తీసుకుంటే.

వాటిలో ఉండే కెరోటినాయిడ్స్ స్కిన్ టోన్ ను గ్రేట్‌గా ఇంప్రూవ్ చేస్తాయ‌ని సౌంద‌ర్య నిపుణులు చెబుతున్నారు.

Telugu Benefits Greens, Greens, Greens Skin, Healthy Skin, Skin Care, Skin Care</div అంతే కాదండోయ్.త‌ర‌చూ ఆకుకూర‌ల‌ను తీసుకుంటే త్వర‌గా చ‌ర్మంపై ముడ‌త‌లు రాకుండా ఉంటాయి.స్కిన్ ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా, కాంతివంతంగా మెరుస్తుంది.

మ‌రియు చ‌ర్మం హైడ్రేటెడ్‌గా కూడా ఉంటుంది.కాబ‌ట్టి, ఆరోగ్యంతో పాటు అందాన్ని పెంచుకోవాల‌నుకుంటే ఖ‌చ్చితంగా డైట్‌లో ఆకుకూర‌లు ఉండేలా చూసుకోండి.

అయితే ఆకుకూర‌ల‌ను క‌ర్రీల రూపంలోనే తీసుకోన‌క్క‌ర్లేదు.జ్యూస్‌, స‌లాడ్స్ రూపంలోనూ తీసుకోవ‌చ్చు.

ముఖ్యంగా జ్యూస్ రూపంలో ఆకుకూర‌ల‌ను తీసుకుంటే ఎక్కువ ప్ర‌యోజ‌నాల‌ను పొందొచ్చ‌ని నిపుణులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube