ఈ మధ్యకాలంలో చాలామంది బెల్లీ ఫ్యాట్( Belly fat ) వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.బెల్లీ ఫ్యాట్ వలన ఇష్టమైన దుస్తులను ధరించలేకపోతున్నారు.
ఈ విధంగా చాలా మంది బెల్లీ ఫ్యాట్ ని తగ్గించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ తరం యువతకు బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడం ఒక కలగా మారిపోయింది.
ఇక చాలామంది ఇది అంత త్వరగా వెళ్ళిపోదని అనుకుంటూ ఉంటారు.కానీ న్యూట్రిషన్లు మాత్రం కొన్ని టిప్స్ పాటిస్తే ఈ సమస్యను ఈజీగా తగ్గించుకోవచ్చని అంటున్నారు.
అయితే మారిన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం, లాంటి కారణాల వలన భారీగా బరువు పెరిగిపోతారు.ఆ తర్వాత స్లిమ్ గా మారేందుకు ఎన్నో కష్టాలు పడతారు.

అయితే ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటించడం వలన ఆ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వుని ఈజీగా కలిగించుకోవచ్చు.అయితే బాన పొట్ట తగ్గేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకున్నాక ఒక గ్లాసులో ఒక నిమ్మకాయ రసం( Lemon juice ), ఒక స్పూన్ తేనె( Honey ) కలిపి తాగాలి.ఇలా ఈ మార్నింగ్ డ్రింక్ మీ జీర్ణక్రియను( Digestion ) మెరుగుపరుస్తుంది.
అలాగే బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.ఇక ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసే ముందు వ్యాయామం చేయడం చాలా ముఖ్యం.
ఇలా చేయడం వలన పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది.

అలాగే ఇది మీ జీవక్రియలను యాక్టివేట్ చేస్తుంది.రోజు వారి కార్యకలాపాలతో ఒత్తిడికి గురైన మనసును కూల్ చేయడానికి ధ్యానం చాలా అవసరం.కాబట్టి ఉదయం వ్యాయామం చేసిన తర్వాత ధ్యానం చేయాలి.
ఇక ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.ఎందుకంటే ప్రోటీన్ లు శరీరంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.
ఇక విటమిన్ డి( Vitamin D ) కూడా బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది.కాబట్టి ఉదయం పూట మీ శరీరంపై సూర్యరష్మి పడేలా చూసుకోవాలి.
అలాగే ఎండలో కాసేపు వాకింగ్( walking ) చేస్తే శరీరం లో ఉన్న చెడు కొలెస్ట్రాల్( Bad cholesterol ) మొత్తం కరిగిపోతుంది.