ఒక పక్క విజయవాడ ( Vijayawada )నగరాన్ని వరదలు ముంచెత్తి ప్రజలు అష్ట కష్టాలు పడుతుంటే, మరోవైపు ఈ వరదల్లోనూ బురద రాజకీయం అన్నట్లుగా రాజకీయ పార్టీల నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.ముఖ్యంగా వరద సాయం విషయంలో అధికార పార్టీని టార్గెట్ చేసుకుని వైసిపి విమర్శలు చేస్తుండగా, గత వైసిపి పాలనలోవి నిర్వాహకాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అధికార కూటమి పార్టీలు ప్రతి విమర్శలు చేస్తున్నాయి.
ఇక వరద సాయం పంపిణీ విషయంలో అధికార పార్టీని ఇరుకున పెట్టే విధంగా వైసిపి అధినేత జగన్( Jagan ) చేస్తున్న విమర్శలు, డిమాండ్లు చర్చనీయాంశంగా మారాయి.
తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వరదలు సంభవిస్తే బాధితులకు నష్టపరిహారం ఇచ్చానని ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు( Chandrababu ) ఎందుకు వరద సాయం ఇవ్వరు అని జగన్ ప్రశ్నిస్తున్నారు. తాను పరిహారాన్ని పునరావస కేంద్రం నుంచి బాధితులు వెళ్ళేటప్పుడే ముట్ట చెప్పానని ఇప్పుడు తక్కువ పునరావస కేంద్రాలను ఏర్పాటు చేయడం ఏంటని జగన్ ప్రశ్నిస్తున్నారు.వరద బాధితులందరికీ నష్టపరిహారాన్ని చెల్లించాల్సిందేనని జగన్ డిమాండ్ చేస్తున్నారు.
గత వైసిపి ( YCP )ప్రభుత్వం లో వరదలు సంభవించాయి. కొన్ని గ్రామాలకి ఆ వరదలు పరిమితం అయ్యాయి.
వరద బాధితుల సంఖ్య తక్కువగా ఉండడంతో పునరాశ కేంద్రాల నుంచి వారు వెళ్లే సమయంలో 2000 రూపాయల నగదును, నిత్యవసర సరుకులను ఇచ్చి పంపించారు.వరద బాధితులు తక్కువగా ఉండడంతోనే అది సాధ్యమైంది.
కానీ విజయవాడ వరద బాధితులు మూడున్నర లక్షల మందికి పైగానే ఉన్నారు.వారందరికీ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం ఒక రాత్రిలో సాధ్యం కాదు.
అలాగే వారికి పరిహారం ప్రకటించాలన్న ఇప్పుడు సాధ్యమయ్యే పరిస్థితి లేదు.
ఎందుకంటే ఏపీ ఆర్థిక పరిస్థితి ఆ విధంగా ఉంది .ఈ విషయం జగన్ కు తెలియంది కాదు.విజయవాడ వరద బాధితులు దాదాపు మూడున్నర లక్షల మంది ఉన్నారు.
వారికి 2000 రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి ప్రకటించినా భారీగా నిధులు ఖర్చు అవుతాయి.కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతటి భారం మోసే పరిస్థితిలో ఏపీ లేదు.
ఇక వరద బాధితుల కు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వము సత్వరమే చర్యలు చేపట్టింది.రేయింబవళ్ళు అధికారులు, చంద్రబాబు మిగతా మంత్రులు , ఎమ్మెల్యేలు ఇలా అంతా తమ శక్తి మేరకు పనిచేశారు.
కేంద్రం నుంచి భారీగా నిధులు వస్తే తప్ప వరద బాధితులకు నగదు సాయం అందించే పరిస్థితి ప్రస్తుతానికి లేదు.