అమెరికా దేశం, ఫ్లోరిడా రాష్ట్రం, ఆసెన్షన్ సేక్రెడ్ హార్ట్ ఎమరాల్డ్ కోస్ట్ ఆసుపత్రిలో( Ascension at Sacred Heart Emerald Coast Hospital ) దారుణం జరిగిపోయింది.ఇక్కడి డాక్టర్ సర్జరీ టైమ్‌లో చేసిన పొరపాటు ఓ వ్యక్తి మరణానికి దారి తీసింది.
వివరాల్లోకి వెళితే, ఆగస్టు 19న బిల్ బ్రయాన్ అనే వ్యక్తికి ఆరోగ్య సమస్య వచ్చి ఆసుపత్రికి వెళ్లాడు.అక్కడ డాక్టర్ తోమస్ షక్నోవ్స్కీ ఆయనకు చికిత్స చేశాడు.
ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పగా, బిల్ కుటుంబం మొదట సంకోచించినప్పటికీ, డాక్టర్ చెప్పిన మాటలు నమ్మి ఆపరేషన్ చేయించుకున్నారు.కానీ, ఆపరేషన్ సమయంలో డాక్టర్ తప్పు చేసి బిల్ ప్లీహము ( Bil’s spleen )బదులు కాలేయాన్ని తీసేశాడు.
దీంతో బిల్ అధిక రక్తస్రావం అయి మరణించాడు.దాంతో బిల్ కుటుంబం షాక్ తిన్నది.
అలాగే వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టుకు ఎక్కింది.
డాక్టర్ షక్నోవ్స్కీ ( Dr.Shaknowski )2024, ఆగస్టు 21న బిల్ బ్రయాన్‌కు రోగికి ల్యాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స చేశాడు.ఈ శస్త్రచికిత్సలో రోగి శరీరంలోని మూత్రపిండాన్ని తీసేయాలి.
కానీ, డాక్టర్ పొరపాటున కాలేయాన్ని తీసేశాడు.ప్రమాదవశాత్తు జరిగిన ఈ తప్పు వల్ల కాలేయంలోని పెద్ద రక్తనాళాలు( Large blood vessels ) తెగిపోయి రోగి చనిపోయాడు.
శస్త్రచికిత్స తర్వాత, డాక్టర్ బిల్ భార్యతో మాట్లాడుతూ, తాను తీసిన ప్లీహము సాధారణం కంటే చాలా పెద్దదిగా ఉందని, శరీరంలో అవతల వైపుకు జరిగిపోయిందని చెప్పాడు.కానీ, తర్వాత పరిశీలనలో తీసిన అవయవం కాలేయమని, రోగి ప్లీహము చిన్న సిస్ట్‌తో కలిసి సరిగ్గానే ఉందని తేలింది.
డాక్టర్ తోమస్ షక్నోవ్స్కీ గతంలో కూడా ఇలాంటి తప్పు చేసినట్లు తెలిసింది.2023లో ఆయన ఒక రోగికి శస్త్రచికిత్స చేసేటప్పుడు, అడ్రినల్ గ్రంధి బదులుగా క్లోమంలోని భాగాన్ని తొలగించేశాడు.ఆ సమయంలో ఈ విషయం పెద్దగా బయటకు రాలేదు.కానీ, డాక్టర్ తన పనిని అదే ఆసుపత్రిలో కొనసాగించాడు.బిల్ భార్య బెవర్లీ ( Beverly )డాక్టర్ షక్నోవ్స్కీ ఇకపై ఎవరికీ చికిత్స చేయకుండా అతన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఆమె భర్త మరణానికి డాక్టర్ చేసిన తప్పులే కారణమని ఆరోపిస్తున్నారు.
ఆయన తప్పుల వల్ల ఇంకొకరు బాధపడకూడదు, చనిపోకూడదని భావిస్తున్నారు.ఆసుపత్రికి డాక్టర్ గతంలో చేసిన తీవ్ర తప్పులు తెలుసు అయినప్పటికీ, మరోసారి ఇలాంటి విషాదం జరగకుండా నిరోధించడానికి తగిన చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపిస్తున్నారు.
డాక్టర్ షక్నోవ్స్కీ ఇప్పటికీ ఆ ఆసుపత్రిలో లేదా దగ్గర్లోని ఇతర ఆసుపత్రులలో శస్త్రచికిత్సలు చేయడానికి అనుమతి ఉందా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియదు.