క్షమాపణ చెప్తా అన్నా కూడా ఆ సినిమాలో ఛాన్స్ ఇవ్వలేదు : నటి దివ్యవాణి

రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన “పెళ్లి పుస్తకం (1991)” సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలోని “శ్రీరస్తు శుభమస్తు” పాట ఎవర్ గ్రీన్ హిట్ అయింది.

 Divya Vani About Mister Pellam Movie Chance Details, Divyavani, Actress Divyavan-TeluguStop.com

ఇందులో రాజేంద్రప్రసాద్ భార్యగా కనిపించిన నటి దివ్యవాణి( Actress Divyavani ) అందరినీ ఆకట్టుకుంది.ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా ఉంటుంది.పైగా బాగా నటిస్తుంది.“పెళ్లి పుస్తకం” సినిమానే ఆమెకు చాలా గుర్తింపు తెచ్చి పెట్టింది.ఈ తార 40కు పైగా సినిమాలు చేసింది.రాజేంద్రప్రసాద్( Rajendra Prasad ) సినిమాల్లో నటించి తెలుగువారికి బాగా దగ్గరయింది.

“ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం (1991)” సినిమాలో దివ్యవాణి హీరోయిన్‌గా యాక్ట్ చేసింది.దాని తర్వాత “పెళ్లి పుస్తకం”( Pelli Pustakam ) సినిమాలో సత్యభామగా కనిపించి అలరించింది.

పెళ్లయిన తర్వాత సినిమాల నుంచి గ్యాప్ తీసుకుంది.రాధాగోపాలం (2005) సినిమాతో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చింది.

Telugu Divyavani, Rajendra Prasad, Amani, Mister Pellam, Pelli Koduku, Pelli Pus

తెలుగు సీరియల్ లో కూడా నటించింది.ఆమె “పుత్తడి బొమ్మ”లో ఒక కీ రోల్‌ ప్లే చేసి అలరించింది.టీడీపీ పార్టీలో చేరడం తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పడం కూడా జరిగిపోయింది.ఇప్పుడు దివ్యవాణి ఏం చేస్తుంది? అని ప్రేక్షకులు సందేహాలు వ్యక్తం చేస్తున్న వేళ ఆమె ఓ ఇంటర్వ్యూలో ప్రత్యక్షమైంది.ఈ ఇంటర్వ్యూలో ఆమె తన గురించి, అలాగే కెరీర్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది.“మిస్టర్ పెళ్ళాం (1993)”( Mister Pellam Movie ) సినిమా తానే చేయాల్సి ఉందని కానీ కావాలనే తనని తొక్కేసారని దివ్యవాణి వాపోయింది.ఈమె మాట్లాడుతూ “మిస్టర్ పెళ్ళాం సినిమాలో హీరోయిన్‌గా దివ్యవాణి వద్దు అని రాజేంద్రప్రసాద్ చెప్పారు.అప్పటిదాకా సినిమాలో హీరోయిన్ నేనే అని అందరూ అనుకున్నారు.కానీ రాజేంద్రప్రసాద్ నన్ను తీసుకోవద్దు అని అనడంతో నేను బాధపడిపోయాను.

Telugu Divyavani, Rajendra Prasad, Amani, Mister Pellam, Pelli Koduku, Pelli Pus

నాది ఏదైనా తప్పు ఉంటే, పాపం చేసి ఉంటే నేను క్షమాపణ చెప్తా అని కూడా అన్నాను.కానీ ఈ మూవీలో నటించే ఛాన్స్ రాలేదు.తర్వాత నిజం ఏంటో తెలిసింది.

అనంతరం వాళ్లు నా కోసమే పెళ్లి కొడుకు (1994)( Pelli Koduku Movie ) అనే సినిమా తీశారు.ఇది ఫ్లాప్ అయ్యింది.

ఆ అమ్మాయికి సినిమా మిస్ అయింది, పాపం బాధపడుతుంది ఏమో అని భావించి ఆ మూవీ చేశారు.అది చంద్రమోహన్, విజయనిర్మల చేసిన “బంగారు పిచిక”కు రీమేక్.

పెళ్ళికొడుకు సినిమా దురదృష్టం కొద్దీ ఫ్లాప్ అయింది.నిర్మాతలకు నష్టాలు వచ్చాయి.” అని చెప్పుకొచ్చింది.మిస్టర్ పెళ్ళాం సినిమాలో రాజేంద్రప్రసాద్ సరసన ఆమని నటించారు.

ఆ మూవీకి ఆరు నంది అవార్డులు వచ్చాయి.ఇది సూపర్ డూపర్ హిట్ అయింది.

ఇందులో దివ్యవాణి నటించినట్లయితే ఆమె ఫేట్ మరోలాగా ఉండేది.ఇలాంటి సక్సెస్ పడకపోవడం వల్లే ఈ ముద్దుగుమ్మ పెద్దగా సినిమా అవకాశాలు దక్కించుకోలేకపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube