తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వరదలకు( Floods ) లక్షల మంది ప్రజలు బాధితులయ్యారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలోని ప్రజలు బాగా నష్టపోగా తెలంగాణలో ఖమ్మం, కోదాడ, సూర్యాపేట ప్రాంతాల్లో సామాన్యులు, రైతులు కోట్లల్లో నష్టపోయారు.
వరదల కారణంగా సర్వం కోల్పోయిన ప్రజలు లక్షల సంఖ్యలో ఉన్నారు.కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు.
ఇలాంటి కష్ట సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ వరద బాధితులందరికీ అండగా నిలిచింది.చాలామంది సినిమా సెలబ్రిటీస్ భారీ ఎత్తున విరాళాలు( Donations ) అందజేశారు.మరి ఇప్పటిదాకా ఎవరెవరు ఎంతెంత డబ్బులు ఇచ్చారో తెలుసుకుందాం.
• పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP Deputy CM Pawan Kalyan ) ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.1 కోటి, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.1 కోటి ప్రకటించారు.అంతేకాకుండా, 400 ఎఫెక్టెడ్ పంచాయతీలకు ఒక్కొక్కటికీ రూ.1 లక్ష (అంటే మొత్తం రూ.4 కోట్లు)! డొనేట్ చేశారు.అలా మొత్తంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఒక్కరే వ్యక్తిగతంగా 6 కోట్ల రూపాయల విరాళం అందజేసి తన గొప్ప మనసును చాటుకున్నారు.
• ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) ప్రకృతి వైపరీత్యాలలో బాధితులైన వారికి ఎప్పుడు అండగా ఉంటారు ఆయన ఈసారి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రెండు కోట్లు విరాళంగా అందజేశారు.తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధులకు తలో కోటి రూపాయలు ఇస్తున్నట్లుగా ఆయన ఇటీవలే ప్రకటించారు.
• కోటి రూపాయలు డొనేట్ చేసిన వాళ్లు:
యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) ప్రతి తెలుగు రాష్ట్రానికి రూ.50 లక్షలు చొప్పున మొత్తంగా రూ.1 కోటి డొనేట్ చేశారు.చిరంజీవి,( Chiranjeevi ) ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్, బాలకృష్ణ, అక్కినేని ఫ్యామిలీ అందరూ ఏపీ తెలంగాణ స్టేట్స్కు కలిపి రూ.1 క్రోర్ డొనేట్ చేశారు.
• స్మాల్ సినీ సెలబ్రిటీస్
విశ్వక్ సేన్ రెండు రాష్ట్రాలకు కలిపి రూ.10 లక్షలు అందజేయగా.డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ 30 లక్షలు విరాళంగా అందించాడు.
యంగ్ హీరోయిన్ అనన్య నాగేళ్ల 2 లక్షలు విరాళంగా అందించి తన గొప్ప మనసు చాటుకుంది.
• నిర్మాణ సంస్థలు
దిగ్గజ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ ఏపీకి రూ.25 లక్షలు, తెలంగాణకు రూ.20 లక్షలు డొనేట్ చేసింది.హారిక అండ్ హాసిని ప్రొడక్షన్ హౌస్ 50 లాక్స్ డొనేట్ చేసింది.