బిగ్ బాస్ హోస్ట్ గా విజయ్ సేతుపతి రెమ్యూనరేషన్ ఎంతంటే.. కమల్ హాసన్ కంటే ఎక్కువేనా?

బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమానికి ఎంతో మంచి క్రేజ్ ఉంది.ఈ కార్యక్రమం కేవలం తెలుగులో మాత్రమే కాకుండా అన్ని భాషలలో కూడా ప్రసారమవుతుంది.

 Vijay Sethupathi Bigg Boss 8 Tamil Remuneration Details Goes Viral , Bigg Boss,-TeluguStop.com

  ఇక తెలుగులో ఏడు సీజన్లని పూర్తిచేసుకుని ఎనిమిదవ సీజన్ ప్రసారమవుతుంది.ఇక తమిళంలో కూడా ఈ కార్యక్రమం ఎనిమిదవ సీజన్ ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది.

ఇక తమిళంలో ఇప్పటివరకు ప్రసారమైన అన్ని సీజన్లకు కమల్ హాసన్ ( Kamal Hassan ) హోస్ట్ గా వ్యవహరించారు.అయితే ఈ సీజన్ కి మాత్రం ఈయన హోస్ట్ గా వ్యవహరించడం లేదు.

Telugu Bigg Boss, Kamal Hassan, Kollywood, Tamil-Movie

ఈ విషయాన్ని కమల్ హాసన్ స్వయంగా ప్రకటించడంతో ఈ కార్యక్రమానికి హోస్ట్ ఎవరు అనే విషయంపై ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.గతంలో ఈ కార్యక్రమ ఓటీటీ హోస్ట్ గా వ్యవహరించిన నటుడు శింబు ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తారనే వార్తలు వినిపించాయి.అలాగే రమ్యకృష్ణ కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారంటూ వార్తలు వచ్చినప్పటికీ ఈ కార్యక్రమానికి విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్లు బిగ్ బాస్ నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు.

Telugu Bigg Boss, Kamal Hassan, Kollywood, Tamil-Movie

ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలు కూడా విడుదలయ్యాయి.ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి అయిందని అక్టోబర్ మొదటి వారం నుంచి ఈ కార్యక్రమం ప్రసారం కాబోతుందని తెలుస్తుంది.ఇక ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తున్నటువంటి నటుడు విజయ్ సేతుపతి ఒక సినిమా కోసం దాదాపు 20 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్( Remuneration ) తీసుకుంటున్నారు.

మరి ఈ కార్యక్రమానికి ఈయన ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్( Remuneration ) తీసుకుంటున్నారనే విషయం పట్ల చర్చలు మొదలయ్యాయి.అందుతున్న సమాచారం ప్రకారం ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించడం కోసం విజయ్ సేతుపతి ఏకంగా 50 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్టు సమాచారం.

అయితే కమల్ హాసన్ ఒక్కో సీజన్ కి సుమారు 120 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube