బిగ్ బాస్ హోస్ట్ గా విజయ్ సేతుపతి రెమ్యూనరేషన్ ఎంతంటే.. కమల్ హాసన్ కంటే ఎక్కువేనా?

బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమానికి ఎంతో మంచి క్రేజ్ ఉంది.

ఈ కార్యక్రమం కేవలం తెలుగులో మాత్రమే కాకుండా అన్ని భాషలలో కూడా ప్రసారమవుతుంది.

  ఇక తెలుగులో ఏడు సీజన్లని పూర్తిచేసుకుని ఎనిమిదవ సీజన్ ప్రసారమవుతుంది.ఇక తమిళంలో కూడా ఈ కార్యక్రమం ఎనిమిదవ సీజన్ ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది.

ఇక తమిళంలో ఇప్పటివరకు ప్రసారమైన అన్ని సీజన్లకు కమల్ హాసన్ ( Kamal Hassan ) హోస్ట్ గా వ్యవహరించారు.

అయితే ఈ సీజన్ కి మాత్రం ఈయన హోస్ట్ గా వ్యవహరించడం లేదు.

"""/" / ఈ విషయాన్ని కమల్ హాసన్ స్వయంగా ప్రకటించడంతో ఈ కార్యక్రమానికి హోస్ట్ ఎవరు అనే విషయంపై ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.

గతంలో ఈ కార్యక్రమ ఓటీటీ హోస్ట్ గా వ్యవహరించిన నటుడు శింబు ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తారనే వార్తలు వినిపించాయి.

అలాగే రమ్యకృష్ణ కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారంటూ వార్తలు వచ్చినప్పటికీ ఈ కార్యక్రమానికి విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్లు బిగ్ బాస్ నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు.

"""/" / ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలు కూడా విడుదలయ్యాయి.ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి అయిందని అక్టోబర్ మొదటి వారం నుంచి ఈ కార్యక్రమం ప్రసారం కాబోతుందని తెలుస్తుంది.

ఇక ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తున్నటువంటి నటుడు విజయ్ సేతుపతి ఒక సినిమా కోసం దాదాపు 20 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్( Remuneration ) తీసుకుంటున్నారు.

మరి ఈ కార్యక్రమానికి ఈయన ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్( Remuneration ) తీసుకుంటున్నారనే విషయం పట్ల చర్చలు మొదలయ్యాయి.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించడం కోసం విజయ్ సేతుపతి ఏకంగా 50 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్టు సమాచారం.

అయితే కమల్ హాసన్ ఒక్కో సీజన్ కి సుమారు 120 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది.

 .

ఆర్ఆర్ఆర్ కంటే ఎక్కువ బిజినెస్ తో బన్నీ సంచలనం.. అసలేం జరిగిందంటే?