విశ్వం సినిమా సక్సెస్ తోనే సమాధానం చెప్తాం అంటున్న గోపిచంద్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే గోపిచంద్( Gopichand ) లాంటి నటుడు కూడా తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.

 Gopichand Says That He Will Answer With The Success Of Viswam Movie Details, Gop-TeluguStop.com

ఇప్పటికే ఆయన వరుస సినిమాలను చేసుకుంటూ ప్లాప్ లను మూట గట్టుకుంటున్నాడు.ఇక సక్సెస్ లు వచ్చినప్పటికీ ఆయన ఆ సక్సెస్ లను మాత్రం నిలబెట్టుకోలేకపోతున్నాడు.

అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన శ్రీను వైట్ల( Srinu Vaitla ) దర్శకత్వంలో చేస్తున్న విశ్వం సినిమాతో( Viswam Movie ) మరోసారి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు.తను చాలా వరకు ఈ సినిమా మీదే కసరత్తులు చేస్తున్నాడు.

 Gopichand Says That He Will Answer With The Success Of Viswam Movie Details, Gop-TeluguStop.com

ఇక ఈ సందర్భంలో సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇంతకుముందు శ్రీను వైట్ల చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయిన విషయం మనకు తెలిసిందే.మరి ఇలాంటి సందర్భంలో గోపీచంద్ సినిమా చేసి రిస్క్ చేస్తున్నారు అంటూ టాలీవుడ్ సినీ మేధావులు సైతం వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఇక రీసెంట్ గా వచ్చిన టీజర్ ని కనక చూసినట్లైతే టీజర్ ( Viswam Teaser ) మాత్రం చాలా అద్భుతంగా ఉంది.

ఇంతకుముందే ఈ సినిమా మీద ఎలాంటి అంచనాలు లేకపోయినప్పటికీ టీజర్ తో మాత్రం అంచనాలను భారీగా పెంచేశారు.

ఇక మొత్తానికైతే వీళ్ల సినిమా మీద మొదట్లో కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఆ సినిమాతోనే వాటికి సమాధానం చెప్పడానికి ఇద్దరు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది.చూడాలి మరి ఈ సినిమాతో వాళ్ళు ఎలాంటి సక్సెస్ సాధిస్తారు అనేది.ఒకవేళ సినిమా సూపర్ సక్సెస్ అయితే ఇద్దరి లైఫ్ లు ఒకేసారి సెటిల్ అవుతాయని చెప్పడంలో ఎలాంటి అతి శయోక్తి లేదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube