మన్మధుడు చిత్రంలో నాగార్జున.వద్దుర సోదర పెళ్లంటే నూరేళ్ల మంటరా అంటూ పాట పాడి పెళ్లి గురించి యువతలో భయాలను పెంచాడు, ఆ తర్వాత కూడా పెళ్లి గురించి ఎన్నో జోకులు పేళుతూనే ఉన్నాయి.
పెళ్లి అయిన పురుషుడు కనీసం టీవీ ఛానెల్ మార్చే స్వేచ్చను కూడా కోల్పోతాడు, పూర్తి స్వాతంత్య్రంను కోల్పోతాడు అంటూ జోకులు పెద్ద ఎత్తున వస్తూనే ఉంటాయి.పెళ్లి కాకముందు పులి, పెళ్లి అయిన తర్వాత పిల్లి ఇలా ఎన్నో రకాలుగా పెళ్లి గురించి జోకులు వినిపిస్తుంటాయి.
అయితే పెళ్లి చేసుకుంటే వచ్చే ఇబ్బందుల కంటే పొందే ప్రయోజనాలు ఎక్కువ అనే విషయాన్ని కుర్రకారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
పెళ్లి చేసుకోకుండా ఉండే మగాళ్లు సగటున 58 నుండి 60 ఏళ్ల వరకు మాత్రమే జీవిస్తారంటూ అమెరికాకు చెందిన ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో వెళ్లడి అయ్యింది.పురుషులు తమ ఆరోగ్యం గురించి ఎక్కువగా పట్టించుకోరు.ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వారు అసలు ఆరోగ్యం గురించిన ఆలోచన లేకుండా జీవించేస్తూ ఉంటారు.
పెళ్లి చేసుకోని వారు ఆరోగ్యం గురించి పట్టించుకోని కారణంగా త్వరగా మృత్యువాత పడతారని సర్వే ఫలితంలో వెళ్లడయ్యింది.
ఒకవేళ పెళ్లి చేసుకుంటే మాత్రం పురుషుల ఆరోగ్య విషయమై భార్యలు జాగ్రత్తలు తీసుకుంటారు.అలా తీసుకోవడం వల్ల ఆయుస్సు ఎక్కువ కాలం ఉంటుందని అంటున్నారు.పురుషుడి జీవితంలోకి మహిళ ఎంటర్ అయిన తర్వాత ఆరోగ్యం విషయంలో మొదటి నుండి జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, ఆహారం విషయంలో కూడా జాగ్రత్తు పాటిస్తూ వస్తుంది.
ఇష్టం వచ్చినట్లుగా తినకుండా అతడిని అదుపులో పెడుతుంది.అలా పెట్టడం వల్ల చాలా వరకు ఆరోగ్యం బాగుంటుంది.
ఇక ఆర్థికపరమైన విషయాల్లో కూడా ఆమె జోక్యం ఉంటుంది కనుక ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది.అలా పెళ్లి చేసుకుంటే పురుషుడికి పలు రకాలుగా మేలు జరుగుతుంది.