ఏళ్ల తరబడి ప్రేమించుకుని తీరా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ప్రియుడు ముఖం చాటేయడంతో ప్రియురాలు అతని ఇంటి ఎదుట 41 రోజులు దీక్ష చేసి అనుకున్నది సాధించుకుంది.ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి లో చోటుచేసుకుంది.
వివరాలలోకి వెళ్తే.
శ్వేత, సుధీర్ కొద్ది సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు.అయితే పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి ముఖం చాటేస్తూ వచ్చాడు.తీరా పెద్దలు కూడా పెళ్ళికి ఓకే అన్న తర్వాత ప్లేటు ఫిరాయించాడు సుధీర్.
శ్వేత ఎంత బతిమాలినా కాదు పొమ్మన్నాడు.చివరకు ఆమె సుధీర్ ఇంటి ఎదుట బైఠాయించింది.
ఒక దశలో ఆత్మహత్యాయత్నం చేసింది.దీంతో మనసు మార్చుకున్న సుధీర్ పెళ్లికి అంగీకరించడంతో మంగళవారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మత్చ్యగిరీంద్ర స్వామి గుడిలో ఆమెను వివాహం చేసుకున్నారు.
తాజా వార్తలు