న్యూయార్క్: షేర్డ్‌ అపార్ట్‌మెంటే అయినా రూ.1.7 లక్షల మంత్లీ రెంట్!

న్యూయార్క్( New York City ) ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలలో ఒకటి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అందుకే ఇక్కడ ఇళ్ల అద్దె చాలా ఎక్కువగా ఉంటుంది.

 New York: Even If It Is A Shared Apartment, The Monthly Rent Is Rs. 1.7 Lakh!,-TeluguStop.com

చాలా పెద్ద కంపెనీలో ఉద్యోగం చేసిన సరే రెంట్ కట్టడం చాలా మందికి భారంగా అనిపిస్తుంది.అయితే ఇషాన్ అబేసేకేరా అనే 33 ఏళ్ల ఇంజనీర్, న్యూయార్క్‌లో తన ఆర్థిక పరిస్థితిని నిలబెట్టుకోవడానికి చాలా విచిత్రమైన నిర్ణయం తీసుకున్నాడు.

ఈయన 2022లో లండన్ నుంచి అమెరికా వచ్చాడు.సీఎన్‌బీసీ మేక్ ఇట్‌తో మాట్లాడుతూ, ఇషాన్ ఇంకో 20 మందితో కలిసి ఒక ఇంటిని పంచుకుంటున్నట్లు చెప్పాడు.

ఇది ఒక పెద్ద ఇల్లు అయినప్పటికీ, ప్రతి నెలా అద్దె 2,100 అమెరికన్ డాలర్లు (సుమారు 1,76,000 రూపాయలు) అవుతుందట.న్యూయార్క్‌లో చాలా మంది యువకులు ఒంటరిగా ఇల్లు అద్దెకు తీసుకోలేరు.

అందుకే షేర్డ్‌ అపార్ట్‌మెంట్‌లోనే అద్దెకి ఉండడానికి ఆసక్తి చూపిస్తారు.దీని వల్ల వారికి అద్దె భారం తగ్గుతుంది.

అంతేకాకుండా, ఇతరులతో కలిసి ఉండటం వల్ల వారికి ఒక సమాజం లాంటి అనుభూతి కలుగుతుంది.

Telugu Afdable, Community, Cost, Ishaan, York, Shared-Telugu NRI

ఇషాన్( Ishan ) కూడా ఇదే విషయాన్ని అంగీకరించాడు.ఒంటరిగా ఇల్లు అద్దెకు తీసుకుంటే చాలా ఖర్చు అవుతుందని అతను చెప్పాడు.అతను ‘కోహాబ్స్’ సంస్థ నిర్వహించే ఒక భవనంలో ఉంటున్నాడు.

ఈ భవనంలో ఉండే వారికి వైఫై, విద్యుత్తు, వారానికి ఒకసారి ఇంటిని శుభ్రం చేయడం, అందరూ కలిసి భోజనం చేయడం వంటి సౌకర్యాలు ఉంటాయి.ఈ సౌకర్యాలన్నీ అతను చెల్లించే నెలవారీ అద్దెలోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి.

Telugu Afdable, Community, Cost, Ishaan, York, Shared-Telugu NRI

ఇషాన్ న్యూయార్క్‌కు వచ్చిన కొత్తలో మొదట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఒక బెడ్‌రూమ్ ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో ఉండేవాడు.ఆ అపార్ట్‌మెంట్ అతని కంపెనీ ఏర్పాటు చేసినది.కొన్ని నెలలు అక్కడ ఉండి, ఆ అపార్ట్‌మెంట్ అద్దె భారాన్ని తాను భరించడం చాలా కష్టమని గ్రహించాడు.దీంతో అతను మరో ఆప్షన్ కోసం వెతకడం మొదలుపెట్టాడు.

అప్పుడు అతను క్రౌన్ హైట్స్‌( Crown Heights )లో ఇతరులతో కలిసి ఉండేలా ఒక ఇల్లు కనుక్కొన్నాడు.ఆ ఇంటికి నెలకు 2,000 నుంచి 3,000 డాలర్లు అద్దె.

ఒంటరిగా ఉండే అవకాశం కోల్పోయినప్పటికీ, కొత్త వ్యక్తులను కలుసుకోవడానికి ఇది మంచి అవకాశం అని అతను భావించాడు.ఆ నాలుగు అంతస్తుల భవనంలో 24 బెడ్‌రూములు, షేర్డ్ కిచెన్స్ అండ్ బాత్రూమ్స్ ఉన్నాయి.

జిమ్, కో-వర్కింగ్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి చాలా స్థలం ఉందని ఇషాన్ చెప్పాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube