సీనియర్ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ( Balakrishna ) కుమారుడు మోక్షజ్ఞ ( Mokshagna ) సినిమా ఎంట్రీ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు.మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ అదిగో ఇదిగో అంటూ రెండు మూడు సంవత్సరాల సమయం గడిచిపోతూ ఉన్నప్పటికీ ఇంకా ఈయన సినిమాకు సంబంధించిన అప్డేట్ రాకపోవడంతో అభిమానులు ఎంతో నిరుత్సాహం వ్యక్తం చేశారు.
అయితే ఈ ఏడాది ఈయన సినీ ఎంట్రీ కచ్చితంగా ఉంటుందని బాలయ్య కూడా క్లారిటీ ఇచ్చారు.ఇకపోతే నేడు మోక్షజ్ఞ పుట్టిన రోజు కావడంతో ఈయన మొదటి సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరగడమే కాకుండా మోక్షజ్ఞకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ( First Look Poster ) విడుదల చేశారు.
ఇక ఈ సినిమాలో ఊహించని రేంజ్ లో మోక్షజ్ఞ లుక్ కనిపించడంతో నందమూరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ హీరోని లాంచ్ చేస్తే బాధ్యత బాలయ్య యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ( Prashanth Varma ) చేతులలో పెట్టారు.మోక్షజ్ఞ కోసం ప్రశాంత్ వర్మ అద్భుతమైన కథను కూడా సిద్ధం చేశారని తెలుస్తోంది.ఇక ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి అలాగే తేజస్విని నందమూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమా కోసం మోక్షజ్ఞ తీసుకునే రెమ్యూనరేషన్( Remuneration )కి సంబంధించిన వార్తలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే తన మొదటి సినిమా కోసం ఇప్పటివరకు బాలయ్య తీసుకోని రెమ్యూనరేషన్ మోక్షజ్ఞ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.బాలకృష్ణ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా తన సినిమాలకు 15 నుంచి 20 కోట్ల రూపాయల వరకు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.కానీ మోక్షజ్ఞ మాత్రం తన ఫస్ట్ సినిమాకి 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.
ఇలా మొదటి సినిమాకి ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు.మరి సినిమాల పరంగా మోక్షజ్ఞ తన నటనతో ఎలా మెప్పిస్తారనేది తెలియాల్సి ఉంది.