కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా నటించిన చిత్రం దేవర.( Devara ) జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత నటిస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.
ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానున్న విషయం తెలిసిందే.దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈరోజు నుంచి ఈ సినిమా విడుదల అవ్వడానికి కరెక్ట్ గా 20 రోజులు మాత్రమే సమయం ఉంది.దీంతో మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ షురూ చేసేసారు.
సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది ఈ సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ ను విడుదల చేస్తూ వస్తున్నారు.
ఇక ఈ సినిమా కోసం ఓవర్సీస్ ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.ఈ క్రమంలో అక్కడ స్పెషల్ ప్రీమియర్స్కు రంగం సిద్ధమైంది.ఇప్పటికే ప్రీమియర్స్ కోసం టికెట్ ప్రీ సేల్స్ కూడా ప్రారంభించారు.
ఈ క్రమంలో యూఎస్ బాక్సాఫీస్( US Boxoffice ) దగ్గర దేవర ర్యాంపేజ్ చూపిస్తున్నాడు.తాజాగా ఈ సినిమా 500కే డాలర్ల ప్రీ సేల్స్ వసూళ్లు రాబట్టింది.
దీంతో ఈ సినిమా రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే సినిమా విడుదల కాకముందే రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న దేవర మూవీ సినిమా విడుదల తర్వాత ఎలాంటి అంచనాలను అందుకుంటుందో చూడాలి మరి.మరోవైపు అభిమానులను ఒక బ్యాడ్ సెంటిమెంట్ కలవరపెడుతోంది.అదేంటంటే రాజమౌళితో( Rajamouli ) సినిమా చేసిన తర్వాత ఆ హీరో నెక్స్ట్ ఏ సినిమా చేసిన ఆ సినిమా తప్పకుండా ప్లాప్ అవుతుంది.
ఇప్పటికే చాలామంది హీరోల విషయంలో ఇది నిజమైన విషయం తెలిసిందే.మరి జూనియర్ ఎన్టీఆర్ ఆ బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారో లేదా అన్నది చూడాలి మరి.