యూఎస్ లో ప్రీ సేల్స్ విషయంలో దేవర అరాచకం.. ఈ రికార్డ్స్ ఎవరికీ సాధ్యం కాదంటూ?

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా నటించిన చిత్రం దేవర.

( Devara ) జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత నటిస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.

ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానున్న విషయం తెలిసిందే.దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈరోజు నుంచి ఈ సినిమా విడుదల అవ్వడానికి కరెక్ట్ గా 20 రోజులు మాత్రమే సమయం ఉంది.

దీంతో మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ షురూ చేసేసారు.సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది ఈ సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ ను విడుదల చేస్తూ వస్తున్నారు.

"""/" / ఇక ఈ సినిమా కోసం ఓవర్సీస్ ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ క్రమంలో అక్కడ స్పెషల్ ప్రీమియర్స్‌కు రంగం సిద్ధమైంది.ఇప్పటికే ప్రీమియర్స్ కోసం టికెట్ ప్రీ సేల్స్ కూడా ప్రారంభించారు.

ఈ క్రమంలో యూఎస్ బాక్సాఫీస్( US Boxoffice ) దగ్గర దేవర ర్యాంపేజ్ చూపిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా 500కే డాలర్ల ప్రీ సేల్స్ వసూళ్లు రాబట్టింది.దీంతో ఈ సినిమా రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

"""/" / అయితే సినిమా విడుదల కాకముందే రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న దేవర మూవీ సినిమా విడుదల తర్వాత ఎలాంటి అంచనాలను అందుకుంటుందో చూడాలి మరి.

మరోవైపు అభిమానులను ఒక బ్యాడ్ సెంటిమెంట్ కలవరపెడుతోంది.అదేంటంటే రాజమౌళితో( Rajamouli ) సినిమా చేసిన తర్వాత ఆ హీరో నెక్స్ట్ ఏ సినిమా చేసిన ఆ సినిమా తప్పకుండా ప్లాప్ అవుతుంది.

ఇప్పటికే చాలామంది హీరోల విషయంలో ఇది నిజమైన విషయం తెలిసిందే.మరి జూనియర్ ఎన్టీఆర్ ఆ బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారో లేదా అన్నది చూడాలి మరి.

ఆ ఓటీటీలో రతన్ టాటా డాక్యుమెంటరీ.. నానో కారు వెనుక అసలు కథ ఇదే!