అమెరికా అధ్యక్ష ఎన్నికలు( US presidential election ) హోరాహోరీగా జరుగుతున్నాయి.డెమొక్రాటిక్ అభ్యర్ధి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్‌లు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
ఈ క్రమంలో అమెరికాలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న భారతీయుల మద్ధతు ఎవరికి అనే చర్చ సర్వత్రా జరుగుతోంది.వీరిలో మెజారిటీ సపోర్ట్ కమలా హారిస్‌కే దక్కే అవకాశం కనిపిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే స్వింగ్ స్టేట్స్‌లో ఆమెకు మద్ధతుగా భారతీయ అమెరికన్లు ప్రచారం మొదలుపెట్టారు.
ఈ క్రమంలో అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. హిందూస్ ఫర్ అమెరికా ఫస్ట్( Hindus for America First endorses ) అనే సంస్థ తమ మద్ధతును కమలా హారిస్‌కు కాకుండా ట్రంప్‌కు ప్రకటించడం కలకలం రేపింది.ఈ మేరకు ఈ సంస్థ ఛైర్మన్ ఉత్సవ్ సందూజా ప్రకటించారు.
కమలా హారిస్ కంటే ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతేనే భారత్‌తో సంబంధాలు బాగుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.కమలా హారిస్ అధ్యక్షురాలైతే ఉదారవాదుల ఆధిపత్యం పెరుగుతుందని, భారత్‌కు సంబంధించి కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సందూజా పేర్కొన్నారు.
బైడెన్ – హారిస్ హయాంలో అమెరికా( America )లో అక్రమ వలసలు, నేరాలు, డ్రగ్స్ స్మగ్లింగ్ పెరిగిపోయిందని ఎద్దేవా చేశారు.నవంబర్ 5 ఎన్నికల్లో ట్రంప్ అధ్యక్షుడిగా వస్తే భారత్‌కు అనుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.భారత ప్రధాని నరేంద్ర మోడీతో ట్రంప్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని , అందువల్ల చైనా కంటే ఇండియాకు ఎక్కువ ప్రాజెక్ట్‌లు వచ్చే అవకాశం ఉందని సందూజా పేర్కొన్నారు.ట్రంప్ నేతృత్వంలో ఇండో అమెరికా సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని సందూజా ఆకాంక్షించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా హిందువులు ఎక్కువగా ఉన్న జార్జియా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, మిచిగాన్ , అరిజోనా, నెవాడా ప్రాంతాల్లో ట్రంప్ తరపున తాము ప్రచారం చేస్తామని ఆయన వెల్లడించారు.