గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా:బడుగుల

సూర్యాపేట జిల్లా:గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తానని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.ఆదివారం పట్టణంలోని జివివి గార్డెన్స్ లో జరిగిన గ్రామీణ వైద్యుల(ఆర్.

 Will Work For The Solution Of The Problems Of Rural Doctors: Badugula-TeluguStop.com

ఎం.పి) సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.గ్రామాల్లో ఆపదలో ఉన్న ప్రజలకు గ్రామీణ వైద్యులు ప్రథమ చికిత్స చేసి ఎంతోమంది పేదల ప్రాణాలు కాపాడుతున్నారని వారి సేవలను కొనియాడారు.ప్రాణాలు కాపాడటానికి ప్రథమ చికిత్స ముఖ్యమని గ్రామీణ వైద్యులు పేదలకు గ్రామాల్లో నిత్యం అందుబాటులో ఉంటూ వారి ఆరోగ్యాలను ప్రాణాలను కాపాడుతున్నారని వారి సేవలను కొనియాడారు.

గ్రామీణ వైద్యులకు ప్రభుత్వం తరఫున శిక్షణ అందించి వారి సేవలను మెరుగు పరుస్తామన్నారు.డబల్ బెడ్ రూం ఇండ్లలో గ్రామీణ వైద్యులకు ప్రాధాన్యత ఇస్తామని,ఖాళీ స్థలం వుంటే మూడు లక్షల రూపాయల సహాయం చేస్తామని అన్నారు.

ఆర్ఎంపిల భవనంలో ఫర్నిచర్ కొరకు ఎంపి నిధుల నుండి సహాయం చేస్తానని హామి ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,డాక్టర్ రమేష్ చంద్ర,సంఘం నాయకులు పి.వెంకన్న రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజు ప్రధాన కార్యదర్శి పుప్పాల లక్ష్మినరసయ్య,జిల్లా అధ్యక్షుడు పోలిశెట్టి రాజేందర్,రహమతుల్లా, చిలువేరు చంద్రయ్య,బెల్లంకొండ డాంగె గౌడ్,ఎల్లె వెంకటేశ్వర్లు,పలు జిల్లాల అధ్యక్షులు,ఆహ్వాన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube