సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ లో కొనసాగుతున్న వైఎస్.షర్మిల మహాప్రస్థాన పాదయాత్ర మంగళవారం లక్కవరం చేరుకుంది.
ఆ గ్రామంలో వైఎస్.షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టింది.
ఇక్కడికి చేరుకున్న కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజా గాయకుడు ఏపురి సోమన్నపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.అటు టీఆర్ఎస్ ఇటు వైఎస్సార్ టిపి కార్యకర్తలు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు నానా ఇబ్బందులు పడ్డారు.
టీఆర్ఎస్ కార్యకర్తలకు ధీటుగా వైఎస్సార్ టిపి కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.అనంతరం వైఎస్సార్ టిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న మాట్లాడుతూ హుజూర్ నగర్ నీ అయ్యా అడ్డా కాదు.
ఏం పీక్కుంటావో పీక్కో సైదిరెడ్డి నీకు తమాషా గా ఉందా? అమెరికా నుంచి వచ్చి, సూటుకేసులు ఇచ్చి ఎమ్మెల్యే అయ్యావు.అలా బ్రతుకు,నీపేకాట క్లబ్ లపై నీ ప్రతాపం చూపించుకో, నేను తెలంగాణ ప్రజలు చెమట చుక్కలతో పెట్టిన కారం మెతుకులు తిని బ్రతికిన,ఇక్కడ ఉన్నది షర్మిలక్క తమ్ముడు,నువ్వేమైనా హుజూర్ నగర్ గడ్డను రాసుకొని వచ్చావా?నువు హుజూర్ నగర్ ప్రజల రక్త మాంసాలు తింటున్నవు.నీలాంటి బెదిరింపు గాల్లను చాలా మంది చూసినం,నువ్వు కాదు కదా నీ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఏం పీకలేడు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.నువు పదవుల కోసం,ఆస్తుల కోసం వచ్చావు.
కేసీఅర్ కంటే ముందే ఉద్యమంలో ఉన్న,నేను హుజూర్ నగర్ సెంటర్ కే వస్త,నీకు దమ్ముంటే హుజూర్ నగర్ సెంటర్ కి రా, ఎంతమందిని తీసుకు వస్తావో తీసుకురా,ఇది నీ అయ్యా జాగిరి కాదన్నారు.తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఎక్కడ సైదిరెడ్డి? దొంగలు దొంగలు ఏకమయ్యారు.ప్రశ్నిస్తే జర్నలిస్ట్ లను సైతం అరెస్ట్ లు చేపిస్తున్నవు.నీ గురించి,నీ బాస్ ముఖ్యమంత్రి గురించి మాట్లాడతా ఇది ప్రజాస్వామ్యం దేశం.
బరాబర్ నీ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తా.బట్టలు ఊడదీసి కొడతాం అంటూ హెచ్చరించారు.
నీ కబ్జాలను ప్రశ్నిస్తే తప్పా?దళితుల ముఖ్యమంత్రి ఎందుకు చేయలే నీ బాసు?దళితులను ఎన్ని సార్లు మోసం చేస్తారు?నా జాతి తరుపున,ప్రజల గొంతుక తరుపున,పార్టీ తరుపున బరాబర్ మాట్లాడుత.నా మీద దాడి జరిగితే మీ మీద మీరే దాడి చేసుకున్నట్లు లెక్క.
ఈ రాష్ట్రంలో పేద కళాకారుడిగా పార్టీలు నన్ను వాడుకొని రోడ్డు మీద వదిలిపెట్టాయి.పాలసీలను ప్రశ్నిస్తా కానీ,వ్యక్తిగత విషయలను కాదు అంటూ కడిగిపారేశారు.