ప్రపంచమంతటా రోజురోజుకీ కాన్సర్ బాధితులు ఎక్కువైపోతున్నారు.పల్లె, పట్టణం అని తేడాలేకుండా ఇపుడు చాలామందికి కాన్సర్ బారినపడుతున్నారు.
గత 2 దశాబ్దాల కాలంలో చూసుకుంటే గొంతు క్యాన్సర్ కేసులు విరివిగా పెరుగుతున్నాయి.కొన్ని దేశాల్లో ఈ వ్యాధిని వేగంగా విస్తరిస్తున్న ప్రమాదకర వ్యాధుల జాబితాలో చేర్చడం గమనార్హం.
గొంతు క్యాన్సర్‌లో( Throat Cancer ) ”ఆరోఫరంజియల్ క్యాన్సర్” రకం కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతోందని నిపుణులు గుర్తించారు.ఇది గొంతు వెనుక భాగంలోనుండే టాన్సిల్స్‌పై ప్రభావం చూపిస్తుంది.
ఇక ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణం ఏమంటే, హ్యూమన్ పపిలోమా వైరస్( Human papillomavirus ) (హెచ్‌పీవీ).చాలా గర్భాశయ క్యాన్సర్ కేసులకు కూడా ఇదే వైరస్ కారణం.అయితే, అమెరికా, బ్రిటన్( America ) లాంటి పశ్చిమ దేశాల్లో గర్భాశయ క్యాన్సర్( Cervical cancer ) కంటే ఆరోఫరంజియల్ క్యాన్సర్ కేసులే ఎక్కువగా వస్తున్నాయి.అయితే దీనికి కారణం ఎక్కువగా ఓరల్ సెక్స్ అని చెబుతున్నారు అక్కడి ఆరోగ్య నిపుణులు.
ఒక్క స్పెయిన్‌లోనే ఏటా 8,000 కొత్త ఆరోఫరంజియల్ క్యాన్సర్ కేసులు వస్తున్నాయంటే ఇక అర్ధం చేసుకోవచ్చు.
అంతేకాకుండా మధ్య, దక్షిణ అమెరికాతోపాటు చాలా దేశాల్లోనూ ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని చెబుతున్నారు.ఈ హెచ్‌పీవీ ప్రధానంగా లైంగిక చర్యలతో సంక్రమిస్తుంది.ఆరోఫరంజియల్ క్యాన్సర్‌కు ప్రధాన కారణం ఏమంటే ఎక్కువ మందితో సెక్స్‌లో పాల్గొనడం.
ఇక్కడ ఓరల్ సెక్స్.అనేది ప్రధాన పాత్ర పోషిస్తోంది.
ఇది వైరస్ వ్యాప్తిలో ప్రధాన పాత్ర పోషిస్తోంది.తమ జీవితంలో ఆరుగురు కంటే ఎక్కువ మందితో ఓరల్ సెక్స్ చేస్తే ఈ క్యాన్సర్ వచ్చే ముప్పు 8.5 రెట్లు ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి.