కాటికి కాళ్లు చాపిన తన భార్యను చంపేసి కటకటాల పాలయ్యాడు ఒక వృద్ధ భర్త.అతడిని పోలీసు అధికారులు భారత సంతతికి చెందిన 79 ఏళ్ల టార్సామే సింగ్‌గా గుర్తించారు.
సింగ్ తన 77 ఏళ్ల భార్య మాయా దేవిపై( Maya Devi ) దాడి చేసి చంపినట్లు అంగీకరించాడు.దాంతో అతడి పై హత్య కేసు నమోదు చేశారు.
ఈస్ట్ లండన్( East London )లోని హార్న్‌చర్చ్‌లోని వారి ఇంట్లో మాయాదేవిని చంపినట్లు భర్త ఒప్పుకున్నాడు.
సింగ్ ( Tarsame Singh )మంగళవారం సాయంత్రం సమీపంలోని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తన భార్యను చంపేసినట్లు అధికారులకు తెలియజేశాడు.
పోలీసులు, వైద్యాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు, అక్కడ వారికి తలకు బాగా గాయాలైన మాయాదేవి కనిపించింది.ఆమెను కాపాడదామని అధికారులు సిద్ధమయ్యారు కానీ కొద్దిసేపటి తర్వాత ఆమె మరణించినట్లు తెలుసుకున్నారు.
సింగ్ గురువారం బార్కింగ్‌సైడ్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యాడు.అక్కడే అతనిపై అతని భార్య హత్యకు సంబంధించిన అభియోగాలు మోపారు.ఈ జంట 50 ఏళ్లకు పైగా యూకేలో నివసిస్తోంది.వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.వారు గతంలో రెయిన్‌హామ్‌లో కలిసి పోస్టాఫీసు విధులు నిర్వర్తించేవారు.సింగ్ ఇటీవలే రిటైర్ అయ్యాడు.
అయితే అతను తన ఎందుకు చంపాడో కారణం తెలియ రాలేదు.
పోలీసుల విచారణ సమయంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మాయాదేవి చనిపోయే ముందు వరకు చాలా నార్మల్‌గానే ఉందని ఆమె ఫ్రెండ్ నిర్మలా తెలిపారు.హత్యకు కొన్ని గంటల ముందు ఆమె ఫ్రెండ్స్ తో కలిసి లంచ్ కూడా చేశారు.
దేవి వారం రోజుల ముందు ఒక వెకేషన్ కి వెళ్లాల్సి ఉంది కానీ అది క్యాన్సిల్ అయింది.దేవి సమీప బంధువులకు పోలీసులు ఇప్పటికే సమాచారాన్ని అందించారు.