ఏ సినిమా కైనా దర్శకుడు పూర్తి బాధ్యత వహిస్తాడు.అతను చెప్పినట్టే సినిమా నడుస్తుంది అతని ఆలోచన ప్రకారం ఏ సినిమా తయారవుతుంది.
కానీ కొన్నిసార్లు అనుభవం ఉన్న ఎడిటర్స్ కూడా సినిమాలోని అనేక విషయాలలో సలహాలు ఇవ్వగలరు.అలాంటి ఒక సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్.
ఈయన అన్నపూర్ణ స్టూడియోలో కూర్చుని సినిమాలను ఎడిట్ చేస్తూ ఉంటాడు.టాలీవుడ్ లోనే చాలా సీనియర్ మోస్ట్ ఎడిటర్ గా మార్తాండ్ కె వెంకటేష్ ( Marthand K Venkatesh )కి పేరు ఉంది.
ఒక్కోసారి సినిమా ఎడిట్ చేస్తున్న క్రమంలో అందులోని లోపాలను ఎడిటర్ ఇట్టే కనిపెట్టగలరు.అలా మార్తాండ్ కే వెంకటేష్ సినిమా ఎడిట్ చేస్తున్న క్రమంలో లోపాలను గమనించి సదరు దర్శకనిర్మాతలకు తెలియజేస్తే ఆయన సలహా మేరకు సినిమాను రీషూట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అలాంటి రీ షూట్( Re shoot ) చేసుకోబడ్డ లేదా మార్తాండ్ కే వెంకటేష్ సలహాలు తీసుకొని అందుకు తగ్గట్టు గా మార్పులు చేసిన తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చి విజయాలు సాధించిన సినిమాలను ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ముఖ్యంగా చెప్పుకోదగ్గ సినిమాల విషయానికొస్తే మొదట ఉల్లాసంగా ఉత్సాహంగా( Ullasanga Utsahanga )సినిమా గుర్తించి మాట్లాడుకోవాలి.ఈ సినిమాల్లో రెండు పాటలను ఫారెన్ లొకేషన్స్ లో 30 లక్షల పైగా ఖర్చు పెట్టి షూట్ చేశారు.కానీ ఎడిట్ చేసిన తర్వాత ఆ సినిమా లోని ఆ రెండు పాటలు లేకపోయినా కూడా పెద్దగా నష్టం లేదు అని మార్తాండ్ కె వెంకటేష్ తెలిపారట.
వారి సలహా మేరకు ఆ పాటలను తీసేసి విడుదల చేయగా ఆ సినిమా మంచి విజయం అందుకుంది.
ఇక ప్రభాస్ హీరోగా నటించిన డార్లింగ్ సినిమా( Darling movie ) విషయానికి వచ్చేసరికి సినిమా చాలా వరస్ట్ గా వచ్చింది అని చెప్పడంతో ఆ సినిమా నిర్మాత అయిన దిల్ రాజు మార్తాండ్ కే వెంకటేష్ సలహా మేరకు సినిమాలోని చాలా సన్నివేశాలు తీసేసి 40 రోజుల పాటు రీషూట్ చేసి సినిమాను విడుదల చేస్తే అది అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇక పోకిరి( Pokiri ) సినిమాలో బ్రహ్మానందం మరియు ఆలీ మధ్యలో జరిగిన బెగ్గింగ్ ఎపిసోడ్ కూడా చాలామంది తీసేయాలని చెప్పారు దర్శక నిర్మాతలకు.కానీ ఎడిటింగ్ సమయంలో అది చూసిన మార్తాండ్ సినిమా లో అదే మెయిన్ సన్నివేశం అవుతుంది అని చెప్పారట.
అనుకున్నట్టుగానే అది చాలా బాగా వర్క్ అయింది.