సూర్యాపేట జిల్లా: నడిగూడెం మండలం కరివిరాల గ్రామ సర్పంచ్ గుర్రం నీలిమాకు హై కోర్టులో భారీ ఊరట లభించింది.గ్రామ పంచాయతీ కార్యదర్శిని అడ్డుపెట్టుకొని రాజకీయంగా అణిచివేతకు గురి చేయాలని పెట్టిన తప్పుడు కేసులను సవాల్ చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు.
గ్రామ, మండల, జిల్లా అధికారులు అనేక రకాలుగా ఇబ్బందులు గురిచేసి,ఎలాంటి అవినీతి ఆరోపణలు లేనప్పటికీ, కావాలనే కక్షపూరితంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి,చెక్ పవర్ ను రద్దు చేశారు.
దీనితో ఆమె హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు సర్పంచికి అనుకూలంగా తన చెక్ పవర్ ను తనకే ఇవ్వాలని తీర్పు ఇచ్చింది.దీనిపై సర్పంచ్ ఆనందం వ్యక్తం చేశారు.
కొంతమంది అధికారులు బీఆర్ఎస్ ఏజెంట్లుగా మారి తనపైన తప్పుడు కేసులు పెట్టి తనను సస్పెండ్ చేయించారని, స్థానిక నాయకులతో కలిసి మానసికంగా,పాలనా పరంగా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసినప్పటికీ హైకోర్టు తీర్పుతో న్యాయం గెలిచిందన్నారు.