రికార్డ్ స్థాయిలో రక్తదానం చేసిన ట్రాఫిక్ పోలీసన్న

సూర్యాపేట జిల్లా:ఆయన చేసేది చిన్న చిరుద్యోగం, చేస్తున్నది మాత్రం గొప్ప త్యాగం, మనుషుల్లో మహా మనిషిగా నిలిచిన పోలీసన్న.ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రికార్డ్ స్థాయిలో 30సార్లు రక్తదానం చేసి మానవత్వం ఉన్న మనిషిగా పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు సూర్యాపేట పట్టణానికి చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ పాలవెల్లి రమేష్.

 Traffic Policeman Who Donated Blood At A Record Level-TeluguStop.com

ఆపదలో ఎవరున్నా సరే మొదటగా గుర్తొచ్చే పేరు రమేష్.డ్యూటీలో బిజీగా ఉన్నా ఆపదలో ఉన్నారని తెలుస్తే చాలు పరిగెత్తుకు వచ్చి తన ఔదర్యాన్ని చాటుతాడు.

మంగళవారం ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో రక్తదానం చేసిన రమేష్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని అన్నారు.ప్రతిరోజూ రక్తం అవసరం ఉండి ఎంతోమంది ఇబ్బందులకు గురతున్నారని,తలసేమియా,గర్భిణులు,ప్రమాదాల్లో గాయపడిన వారు రక్తం కోసం పాట్లు పడుతున్నారన్నారు.

రక్తదానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు.ఆపదలో ఉన్న వారికి ఇప్పటివరకు 30సార్లు రక్తదానం చేసినట్లు తెలిపారు.

రక్తం ఇచ్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.శభాష్ పోలీస్ అన్నా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube