సూర్యాపేట జిల్లా:నూతనకల్ మండల కేంద్రం మరియు తాళ్లసింగారం గ్రామాల నుండి టిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేసి,నూతనకల్ మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు నాగం సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరియు తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ గుడిపాటి నరసయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో నూతనకల్ గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జటంగి గణేష్ యాదవ్, తాళ్లసింగారం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తుంగతుర్తి విద్యాసాగర్,పల్స లింగయ్య గౌడ్,ముషం వీరస్వామి,ఇటుకూరి సోమయ్య వల్లమల్ల చంద్రకాంత్,గుర్రాల అమృత్ లతోపాటు పలువురు కార్యకర్తలకు ఉన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కళ్లెం కృష్ణారెడ్డి,జిల్లా పార్టీ నాయకులు దరిపల్లి వీరన్న, ప్రసాదరావు,తాళ్లసింగారం ఎంపీటీసీ తండు శ్రీను, నూతనకల్ గ్రామశాఖ అధ్యక్షుడు బొడ్డుపల్లి అంజయ్య,మాజీ సర్పంచ్ తండు సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బయ్యా గంగయ్య తదితరులు పాల్గొన్నారు.