నల్లగొండ జిల్లా:దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని చింతపల్లి మండలం తీదేడు గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ కాయితి జితేందర్ రెడ్డిని ఎస్ఐ అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ దేవరకొండ మాజీ ఎమ్మెల్యే నేనవత్ బాలు నాయక్ ఆధ్వర్యంలో బుధవారం పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీదేడు గ్రామంలో సర్వే నెంబర్ 206లో గ్రామనికి చెందిన భూమి యజమాని కండే మణెమ్మ తన సొంత ప్లాట్ ను భర్త కండే రామయ్య జ్ఞాపకార్ధంగా కాంగ్రెస్ పార్టీ కార్యలయ నిర్మాణానికి తీదేడు గ్రామానికి చెందిన సందే లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులకు విరాలంగా ఇచ్చారని అన్నారు.
తీదేడు సర్పంచ్, వార్డు సభ్యులు సందే లక్ష్మయ్య,ఇట్టి ప్లాట్ లో కాంగ్రెస్ పార్టీ కార్యలయం కట్టుటకు కొరకు బుధవారం బేస్మెంట్ చేస్తుండగా అకారణంగా చింతపల్లి ఎస్ఐ సర్పంచ్ కాయితి జితేందర్ రెడ్డిని వార్డు సభ్యులు సందే లక్ష్మయ్యని,కాంగ్రెసు పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ వ్యానులో తరలించడం అన్యాయమన్నారు.ఎలాంటి ఫిర్యాదు లేకున్నా అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పిన విధంగా కాంగ్రెస్ సర్పంచ్ ను,పార్టీ కార్యకర్తలను అక్రమంగా, అకారణంగా చింతపల్లి ఎస్ఐ అరెస్ట్ చేయడంఏమిటని ప్రశ్నించారు.
తమ పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెడితే చూస్తూ ఉరుకోమని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని,రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని,అప్పుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రతి పక్ష కార్యకర్తలను వేధిస్తున్న అధికారుల పరిస్థితి ఏమిటో గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నేనావత్ కిషన్ నాయక్,కేతవత్ బిల్యా నాయక్,రవి నాయక్,చింతపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,తీదేడు గ్రామ ప్రజలు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.