ప్రజా సమస్యలు పరిష్కరించాలి:సిపిఎం

సూర్యాపేట జిల్లా:ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూనూతనకల్ మండలం చిల్పకుంట్ల సిపిఎం గ్రామశాఖ ఆధ్వర్యంలో శనివారం ఎంపీడీవో ఇందిరకు వినతిపత్రం అందజేశారు.అనంతరం మండల సిపిఎం కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి( Kandala Shankar Reddy ) మాట్లాడుతూ చిల్పకుంట్ల గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరారు.

 Public Problems Should Be Solved: Cpm, Suryapet District, Kandala Shankar Reddy-TeluguStop.com

ఎస్సారెస్పీ కాలువ ద్వారా సాగునీరు విడుదల చేసి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు.

నూతనకల్ నుండి చిల్పకుంట్ల మీదిగా సంగెం గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, రైతాంగానికి వెంటనే రుణమాఫీ చేయాలని, రైతులందరికీ రైతు బంధు డబ్బులు వెంటనే విడుదల చేయాలని,కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ స్కీంల( SIX GuaranteeS Schemes )ను అర్హులైన పేదలందరికీ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు తొట్ల లింగయ్య,బత్తుల సోమయ్య,బొజ్జ శ్రీను, గజ్జల కృష్ణారెడ్డి,కూసు సైదులు,బాలగాని సోమయ్య,కూసు బాలకృష్ణ,తొట్ల హరీష్, ఎల్లంల నరేష్,ఊసు నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube