స్కిన్ వైట్ గా బ్రైట్ గా మెరిసిపోవాలా.. అయితే ఈ న్యాచురల్ నైట్ క్రీమ్ ను మీరు వాడాల్సిందే!

ముఖంపై ఎలాంటి మచ్చ లేకుండా చర్మం వైట్ గా, బ్రైట్ గా మెరిసిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.కానీ అటువంటి చర్మాన్ని చాలా తక్కువ మంది మాత్రమే కలిగి ఉంటారు.

 Try This Natural Night Cream For White And Bright Skin Details! Natural Night Cr-TeluguStop.com

మీరు కూడా అలాంటి స్కిన్ ను పొందాలనుకుంటే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ నైట్ క్రీమ్ ను( Natural Night Cream ) వాడేందుకు ప్రయత్నించండి.ఈ నైట్ క్రీమ్‌ తయారీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఎర్ర కందిపప్పు,( Red Masoor Dal ) రెండు టేబుల్ స్పూన్లు బియ్యం( Rice ) వేసి రెండు సార్లు వాటర్ తో వాష్ చేసుకోవాలి.

ఆపై ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు ఉదయాన్నే నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు మరియు బియ్యాన్ని మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు నీరు తొలగించిన పెరుగు( Curd ) మరియు వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్( Glycerine ) వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Tips, Skin, Face Cream, Homemade Cream, Latest, Natural Cream, Skin Care,

దాదాపు 5 నిమిషాలు కలిపితే మన క్రీమ్ రెడీ అవుతుంది.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు వాడుకోవచ్చు.నైట్ నిద్రించే ముందు ముఖాన్ని వాటర్ తో వాష్ చేసుకుని తయారు చేసుకున్న క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకోవాలి.క్రీమ్ అప్లై చేశాక రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకుని పడుకోవాలి.

Telugu Tips, Skin, Face Cream, Homemade Cream, Latest, Natural Cream, Skin Care,

నిత్యం ఈ క్రీమ్ ను కనుక వాడితే చర్మం పై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి.మొండి మచ్చలు మాయం అవుతాయి.స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది.ఎర్ర కందిపప్పు, బియ్యం, పెరుగు మరియు గ్లిజరిన్ మీ చర్మాన్ని వైట్ గా బ్రైట్ గా మారుస్తాయి.అందంగా మెరిపిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube