సూర్యాపేట:24 గంటలు ప్రజల రక్షణ కొరకు,శాంతిభద్రతల పరిరక్షణ కోసం పనిచేస్తున్న పోలీసులను తీవ్రవాదులు పొట్టనబెట్టుకుంటున్నారని సూర్యాపేట డిఎస్పీ నాగభూషణం అన్నారు.శాంతిభధ్రతల పరిరక్షణలో భాగంగా విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు నివాళులు అర్పిస్తూ బుధవారం జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ సెంటర్ నుండి రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన పోలీసు స్మారక సంస్మరణ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడుతూ విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు నివాళులు అర్పించేందుకు ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆదేశాల మేరకు పట్టణంలో కళాశాల,పాఠశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించామన్నారు.పోలీసు యునిఫాం అనేది భద్రతకు, క్రమశిక్షణకు మారుపేరని తెలిపారు.
ప్రజలు తమ రక్షణ కొరకు పనిచేస్తున్న పోలీసులకు సహకరించాలని కోరారు.పాఠశాల విద్యార్దుల కొరకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించామని,ఫ్రెండ్లీ పోలీసింగ్,పోలీసు సమాచార వ్యవస్థ,ఆయుధాల వినియోగంపై విద్యార్దులకు అవగాహన కల్పించినట్లు చెప్పారు.
ప్రపంచశాంతి వర్దిల్లాలని,దేశాన్ని రక్షిస్తామని నినాదాలు చేశారు.ఈకార్యక్రమంలో పట్టణ సిఐ రాజశేఖర్,పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్,ఎస్ఐలు శ్రీనివాస్,క్రాంతి కుమార్,సైదులు, యాకుబ్,ట్రాఫిక్ ఎస్ఐలు నరేష్,జహంగీర్,కళాశాల,పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.