సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలి:ఎస్సై ముత్తయ్య

సూర్యాపేట జిల్లా:మారుతున్న కాలానికి నేరగాళ్లు కూడా అనేక రకమైన కొత్త రకం నేరాలకు పాల్పడి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని వారి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని నాగారం ఎస్ఐ ముత్తయ్య తెలిపారు.తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగారం మండలంలో వర్ధమానుకోట హైస్కూల్లో బుధవారం పోలీస్ అమరవీరుల సస్మరణ వారోత్సవాలు సందర్భంగా విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు సామాన్య ప్రజల నుండి కలెక్టర్,ఎస్పీ స్థాయి అధికారులను కూడా మోసం చేస్తున్నట్లు తెలిపారు.

 Be Careful With Cyber Criminals: Esi Muttiah-TeluguStop.com

అలాంటి మోసం జరిగితే 1930 నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు తెలిపితే పోయిన నగదును వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుదన్నారు.అలాగే విద్యార్థులకు,మహిళలకు ప్రమాదం జరిగితే 100 నెంబర్ కు కూడా డయల్ చేయాలని సూచించారు.

కొత్త నెంబర్లకు ఓటిపి చెప్పొద్దని,ఆధార్ కార్డులు,బ్యాంక్ అకౌంట్లూ,ఏటీఎం కార్డులు ఎవరికి ఇవ్వొద్దని అన్నారు.పోలీసులు ప్రజారక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్నారని,ప్రజలు పోలీసులతో సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నాగరాజు,శ్రీనివాస్,హెచ్ సి వెంకటయ్య,పిసిలు వెంకటనారాయణ,రమేష్,హెడ్మాస్టర్ గోవర్ధన్జ్, జ్యోతి,నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube