సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ తెలంగాణ రాష్ట్రంలో హంగు అంటూ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగానే ఉన్నాయని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.బుధవారం మేళ్లచెరువుమండల కేంద్రంలో అయనమీడియాతో మాట్లాడుతూ అన్నా,తమ్ముడు పొద్దున లేస్తే ఏ పార్టీలో ఉంటారో వాళ్లకే తెలవదని ఎద్దేవా చేశారు.
కేంద్రంలో బీజేపీకి రాష్ట్రంలో కాంగ్రెస్ కి జై కొడుతూన్నారని విమర్శించారు.రాష్ట్రంలోబీఆర్ఎస్ 100 సీట్లు గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
భారతదేశంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని,భారతదేశం అభివృద్ధి పథంలో నడవాలంటే కేసీఆర్ లాంటి నాయకులు కావాలని దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుండి స్పష్టమైన సంకేతం వస్తుందన్నారు.