ముదిరాజుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది

సూర్యాపేట జిల్లా: ముదిరాజుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు ఈదుల యాదగిరి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత 60 సంవత్సరాల క్రితం ముదిరాజుల సంక్షేమం కోసం ఏ ప్రభుత్వాలు కృషి చేయలేదని,నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో ప్రతి నియోజకవర్గంలో ముదిరాజుల కోసం కమ్యూనిటీ భవనాలను కేటాయించారని అన్నారు.

 Telangana Government Works For The Welfare Of Mudirajas, Telangana Government ,-TeluguStop.com

హైదరాబాదులో ఐదు ఎకరాల స్థలంలో ఐదు కోట్ల రూపాయలతో భవనాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో చెరువులు,కుంటలు నిండుగా ఉన్నాయని, ఏనాడు కనివినిఎరగని రీతిలో 15 కేజీల చేపలు దొరుకుతున్నాయన్నారు.

త్వరలో మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రతి ఒక్క సంఘ సభ్యునికి డిజిటల్ ఐడెంటి కార్డు రాష్ట్ర ప్రభుత్వం అందజేయనున్నట్లు తెలిపారు.త్వరలో సంఘ సభ్యుల వివరాలు ఆన్లైన్లో తెలుసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని,సంఘ రుసుములు ఆన్లైన్లో చెల్లించే విధంగా కృషి చేస్తామన్నారు.

లక్ష సభ్యత్వాలు నమోదు కోసం కృషి చేస్తామని తెలిపారు.ఆరు నెలల క్రితమే 600 సొసైటీలు ఏర్పాటు చేశామని, ఇప్పుడు కొత్త సభ్యతల కోసం 400 సభ్యత్వాలను కూడా ఆమోదిస్తామని అన్నారు.

మత్స్యకారుల అభివృద్ధి కేంద్రంగా,వారి పిల్లల శిక్షణ కేంద్రంగా భవనాలు ఉపయోగపడే విధంగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,నాయకులు గుండ్లపల్లి శ్రీనివాస్,జగన్, పిట్టల వెంకట నరసయ్య, బొక్క శ్రీనివాస్,ఆకుల లవకుశ,ఇండ్ల సురేష్, ఆకుల రాజేష్,వెలుగు రవి,వెంకట్,దండు రేణుక,వెంకటమ్మ,ఢిల్లీ పావని,కోల నిరంజన్, ఈదునూరి సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube