సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి వద్ద బస్సులో అక్రమంగా గంజాయిని సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తిరుమలగిరి సీఐ రాజేష్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సులో గంజాయిని తీసుకోని వెళుతున్నట్లు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు తన సిబ్బందితో హుటాహుటిన వెళ్లి,తనిఖీలు నిర్వహించగా ఒడిస్సా నుండి ఖమ్మం మీదుగా హైదరాబాదుకు చేరుకోవాల్సి ఉండగా,తిరుమలగిరి చేరుకున్న ఇరువురు వ్యక్తులను బస్సులో ఎక్కి తనిఖీలు చేయగా వారి వద్ద గంజాయి లభ్యమైనట్లు తెలిపారు.
వారిని అరెస్టు చేసి విచారణ జరపగా ఒడిశాకు చెందిన కబీ బిడ్డిక,రమేష్ బిడ్డికలుగా గుర్తించారు.వారి వద్ద నుండి సుమారు 2 లక్షల 50 వేల రూపాయల విలువ గల 12 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని,ఇరువురిపై కేసు నమోదు చేశామన్నారు.