12 మంది కానిస్టేబుళ్ళకు హెడ్ కానిస్టేబుల్స్ గా ఉద్యోగోన్నతి

సూర్యాపేట జిల్లా:జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లల్లో పనిచేస్తున్న 12 మంది కానిస్టేబుళ్ళకు హెడ్ కానిస్టేబుల్స్ గా ప్రమోషన్ లభించింది.ప్రమోషన్ పొందిన సిబ్బంది శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

 12 Constables Have Been Promoted As Head Constables-TeluguStop.com

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రమోషన్ పత్రాలను సిబ్బందికి అందించి,మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యోగోన్నతితో పాటుగా బాధ్యతలు కూడా పెరుగుతాయని బాధ్యతలకు అనుగుణంగా విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండి,ప్రజలకు ఉత్తమ సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని, పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.

క్రమశిక్షణతో మెలుగుతూ తోటి సిబ్బందిని గౌరవిస్తూ సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు.ప్రమోషన్ పొందిన సిబ్బంది వివరాలు ఈ విధంగా ఉన్నాయి.అర్వపల్లి పిఎస్ కు చెందిన బుచ్చయ్య, సూర్యాపేట టౌన్ పిఎస్ కు చెందిన శ్రీనివాసులు, సైదులు, రవి, కోదాడ టౌన్ పిఎస్ కు చెందిన రాంబాబు,పెన్ పహాడ్ పిఎస్ కు చెందిన కృష్ణయ్య,అనంతగిరి పిఎస్ కు చెందిన శ్రీనివాస్, మోతె పిఎస్ కు చెందిన సుధీర్ కుమార్,గురు లింగయ్య,మద్దిరాల పిఎస్ కు చెందిన కె శ్రీనివాస్, తుంగతుర్తి పిఎస్ కు చెందిన బాబర్ అలీ, నడిగూడెం పిఎస్ కు చెందిన శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.ఈ కార్యక్రమంలో డిఎస్పి రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు రాజేష్, మహేష్,అడ్మినిస్ట్రేషన్ అధికారి సురేష్ బాబు, పోలీస్ సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్,సెక్షన్ సూపర్డెంట్ శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube