Mira Chopra : మీరా చోప్రా ఇండస్ట్రీ కి దూరం కావడానికి కారణం ఏంటో తెలుసా ?

హమ్మా మీరా చోప్రా.బంగారం సినిమాలో నటించిన ఈ అమ్మడు మీకు గుర్తుందా ? బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అవ్వాలని గంపెడు ఆశలతో సినిమా ఇండస్ట్రీ కి వచ్చింది.తన కజిన్స్ అయినా ప్రియాంక చోప్రా, పరిణితి చోప్రా, మన్నారా చోప్రా హీరోయిన్స్ గా ఫుల్ ఫామ్ లో ఉండటం తో మీరా కూడా హీరోయిన్ అవ్వాలని అనుకుంది.అయితే ఈ అమ్మడు హిందీ లో ఒక్క సినిమాలో నటించే అవకాశం కూడా రాకపోవడం తో తొలుత అంబే ఆరూయిరే అనే తమిళ సినిమాలో నటించింది.

 Tollywood Heroine Meera Chopra Controversies , Heroine Meera Chopra, Tollywood,-TeluguStop.com

ఆ తర్వాత తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన ఆమె పలు కారణాల వల్ల స్టార్ హీరోయిన్ అవ్వలేకపోయింది.కొన్ని సినిమాలో స్పెషల్ పాత్రల్లో సైతం నటించింది.

ఇటీవల టాటూ మర్డర్స్ అనే హిందీ వెబ్ సిరీస్ లో నటించి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆమెకు సినిమాల్లో అవకాశాలు ఎంతవరకు వస్తాయో అనుమానమే.ఇక ఈ సిరీస్ కన్నా ముందు నాస్తిక్ అనే హిందీ సినిమాకు కూడా సైన్ చేసింది.

మొగిలి పువ్వు అనే తెలుగు సినిమాలో సైతం నటిస్తున్న మీరా ఈ సినిమాలు సక్సెస్ అయితే మల్లి ఫామ్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయ్.ఇక సినిమాల సంగతి కాసేపు పక్కన పెడితే పబ్లిసిటీ ఎంతో ఏంటో ఇష్టం ఉన్న మీరా అప్పుడప్పుడు నోటికి పని చెప్తూనే ఉంటుంది.

ఓసారి తనకు పరిణితి కి సంబంధం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.ఇది హిందీ చిత్ర సీమలో రచ్చకు లేపింది.

Telugu Bjp, Meera Chopra, Mogili Puvvu, Tamil, Tattoo Murders, Telugu, Tollywood

దాంతో బాలీవుడ్ లో ఈ అమ్మడికి అవకాశాలు దక్కలేదు.మరోమారు టాలీవుడ్ స్టార్ హీరో అయినా జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తనకు తెలియదంటూ వ్యాఖ్యలు చేయడం సౌత్ ఇండియాలో సంచలనంగా మారింది.దాంతో ఆమెకు తెలుగు అభిమానుల నుంచి తీవ్రమైన కామెంట్స్ వచ్చాయి.ఇలా అప్పుడప్పుడు నోటికి పని చెప్తుండటం తో ఆమెకు ఇటు తెలుగు లో సైతం అవకాశాలు లేకుండా పోయాయి.

ఇక మరోమారు కరోనా టీకా విషయంలోనూ అవాకులు పేలడం తో అటు బీజేపీ పార్టీ సైతం ఆమెపై విరుచుకుపడింది.ఇలా సంబంధం లేని విషయాల్లో వేలుపెట్టి ఇండస్ట్రీ కి దూరం అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube