ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరబిందో ఫార్మా డైరెక్టర్ పి.శరత్ చంద్రారెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం అరెస్టు చేయడంతో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడినట్లైంది.వైఎస్ఆర్సీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి అల్లుడు పి రోహిత్ రెడ్డి సోదరుడు, శరత్ రెడ్డి కావడంతో ప్రతి పక్షాలు ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి.2012లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సీబీఐ విచారణ జరిపిన క్విడ్ ప్రోకో కేసులో నిందితుల్లో ఆయన కూడా ఒకరు.
2012 మార్చిలో, అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుండి తక్కువ ధరలకు భూకేటాయింపుల చేసినందుకు.జగన్ మోహన్ రెడ్డి జగతి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారని ఆరోపిస్తూ అప్పటి ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ అధినేత శరత్ చంద్రారెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసింది ఢిల్లీ ప్రభుత్వం రద్దు చేసిన మద్యం పాలసీలో అక్రమాలకు సంబంధించి మనీలాండరింగ్ విచారణలో భాగంగా శరత్ రెడ్డి, ఇంటర్నేషనల్ బ్రాండ్స్, పెర్నోడ్ రికార్డ్ జనరల్ మేనేజర్ బెనోయ్ బాబును గురువారం ED అరెస్టు చేసింది.
లైసెన్సుల కార్టలైజేషన్‌లో రెడ్డి కీలక పాత్ర పోషించారని, మొత్తం మద్యం లైసెన్సింగ్ ప్రక్రియలో కిక్‌బ్యాక్‌లను విషయంలో ఆయనదే కీలక పాత్ర అని ED వర్గాలు తెలిపాయి.
మధ్యం పాలసీ కుంభకోణానికి సంబంధించి మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవాకాశం కనిపిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ‘ ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్’తో సంబంధం ఉన్న వ్యక్తుల ఆస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు ముమ్మరం చేసిన నేపథ్యంలో , కేంద్ర ప్రభుత్వం సోమవారం రెండు రాష్ట్రాల్లోని ఆదాయపు పన్ను శాఖకు చెందిన దాదాపు 240 మంది ఉన్నతాధికారులను బదిలీ చేసింది.హైదరాబాద్, విజయవాడ ఐటీ చీఫ్‌ల బదిలీతోపాటు అత్యున్నత స్థాయి అధికారులను మార్చడం ఇదే అతిపెద్దదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు కీలకమైన డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్) పదవిని నిర్వహిస్తున్న హైదరాబాద్ ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ వసుంధర సిన్హా కూడా ఉన్నారు.