సూర్యాపేట జిల్లా:రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సూర్యాపేట నియోజకవర్గ అభ్యర్థిగా సూర్యాపేట న్యాయవాది తెలంగాణ ఉద్యమ కారుడు సూర్యాపేట నియోజకవర్గం ఎoడ్లపల్లి నివాసి ధర్మార్జున్ ను, జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గ అభ్యర్థిగా గరిదేపల్లి మండలo పోనుగొడుకు గ్రామానికి చెందిన దొంతిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ప్రకటించారు.సూర్యాపేటలో జరిగిన జిల్లా ముఖ్యకార్యకర్తల సమావేశంలో కోదండరాం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కెసిఆర్ అవినీతి మయంగా మార్చారని విమర్శించారు.కాంట్రాక్తులు,కమీషన్ల వేట తప్ప పాలనను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు.
వడ్లకోనుగోలులో శాస్త్రీయ పరిష్కారం కోసం ప్రయత్నించకుండా రాజకీయ విమర్శలకు పాల్పడుతున్నారని అన్నారు.పెన్షన్లు ఇవ్వడం లేదు,ధరణి సమస్యలతో రైతులను ఇబ్బంది పెడుతున్నారు.317 జి వో తో ఉద్యోగులను,పీజు రియంబర్స్ మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.కెసిఆర్ బాధ్యతా రాహిత్యం మూలంగా నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని విమర్శించారు.
అవినీతిలేని ఉద్యమ ఆకాంక్షల సాధనకు తెలంగాణ జనసమితి కృషి చేసిస్తుందన్నారు.జిల్లా జనసమితి అధ్యక్షుడు రమాశంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ మండలాలనుంది కోదండరాం సమక్షములో పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో దొంతిరెడ్డి శ్రీనివాస రెడ్డి,మాంద్ర మల్లయ్య, నారాబోయిన కిరణ్,కుంచం చంద్రకాంత్,కంబాలపల్లి శ్రీనివాస్,బంధన్ నాయక్,బచ్చలకురి గోపి, పానుగోటి సూర్యనారాయణ,రఫీ,పగిళ్ళ శ్రీను,భిక్షం నాయక్,పగిళ్ళ శ్రీను,బొమ్మగాని వినయ్ గౌడ్, ఈశ్వర్ సింగ్,నవీన్,దేవత్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.