సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలలో 30 మంది అభ్యర్థులు వివిధ స్థానాలకు పోటీ చేయగా బుధవారం నామినేషన్ల ఉపసంహరణలో భాగంగా 8 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా 22 మంది పోటీపడుతున్నట్లు ఎన్నికల అధికారులు ఎంఎస్ రాఘవరావు,వట్టికూటి అంజయ్య ఒక ప్రకటనలో తెలిపారు.ఈనెల 25వ తేదీ ఎన్నిక నిర్వహించి,అదే రోజు సాయంత్రం ఫలితాలు ప్రకటిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.







