రెడ్లకుంట,ఉత్తమ్ పద్మావతి లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు డిఫ్యూటీ సీఎం శంకుస్థాపన

సూర్యాపేట జిల్లా:పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని,ఆదిశగా ఆర్థిక వనరులు సమకూరుస్తూ దృఢసంకల్పంతో పనిచేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క( Mallu Bhatti Vikramarka ) అన్నారు.బుధవారం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంట గ్రామంలో రూ.47 కోట్ల 64 లక్షలతో చేపట్టనున్న నూతన రెడ్లకుంట ఎత్తిపోతల పథకం,రూ.5.కోట్ల 30 లక్షలతో ఉత్తమ్ పద్మావతి ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనుల శిలాపలకాలకు రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ),స్థానిక శాసన సభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మావతిలతో కలసి శంకుస్థాపన చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన లిఫ్ట్ లు గత ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో సాగునీరు అందక రైతాంగం అనేక ఇబ్బందులు పడ్డారని,ఈ ప్రాంతంలో చేపట్టే రెండు లిఫ్ట్ ల ద్వారా 25 వేల ఎకరాలు సాగు నీరు అందుతుందని వివరించారు.

 Deputy Cm Lays Foundation Stone For Redlakunta And Uttam Padmavati Lift Irrigati-TeluguStop.com

గత పాలకులు కమీషన్లపై ఎక్కువ దృష్టి పెట్టడంతో రాష్ట్రంలో అభివృద్ధి సజావుగా సాగలేదని,నష్టం ఎంతో జరిగిందని స్పష్టం చేశారు.హుజూర్ నగర్,కోదాడ నియోజకవర్గాల్లో స్థలపరిశీలన జరిగిన తదుపరి పేద పిల్లల నాణ్యమైన విద్యానందించే దిశగా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ నిర్మిస్తామని అన్నారు.

అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు అందిస్తామని,అలాగే ఇందిరమ్మ అభయ హస్తం ద్వారా అందించే ఆరు గ్యారెంటీలు ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తుందన్నారు.రాష్ట్రంలో ఎక్కడ కూడా విద్యుత్ కొరతలు లేవని,నాణ్యమైన 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని అన్నారు.పేదలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా,రూ.500 లకే గ్యాస్ సిలెండర్,మహాలక్ష్మి ద్వారా బస్సులలో ఉచిత ప్రయాణం అందిస్తున్నామని, మహిళలకు వడ్డీలేని రుణాలు కింద రూ.1500 కోట్లు నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మాణానికి రూ.5 లక్షలు అందచేయడం జరుగుతుందని,ఈ పథకం భద్రాద్రి రాముడు సన్నిధిలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించడం జరిగిందని, ఇకపై ప్రతి నియోజకవర్గంలో పేదలకు 3500 ఇండ్లను అందిస్తామన్నారు.గత పాలకులు రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో 6 లక్షల 71 వేల కోట్లు అప్పులు చేసినారని గుర్తు చేశారు.

రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ నూరు శాతం పనిచేసే విధంగా అన్ని లిఫ్ట్ లకు నిధులు మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.రెండు లిఫ్ట్ లకు రూ.53 కోట్ల 58 లక్షలు మంజూరు చేయడం జరిగిందని,దాదాపు 25 వేల ఎకరాలు సాగునీరు అందుతుందన్నారు.కోదాడలో 100 పడకల ఆసుపత్రికి శ్రీకారం చుట్టామని,త్వరలో రాష్ట్రంలో అర్హులైన వారికి నూతన రేషన్ కార్డులు అందించనున్నట్లు తెలిపారు.

ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్( S.Venkata Rao ),సిఈ రమేష్ బాబు,ఈఈ ప్రేమ్ చంద్,మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు,ఆర్డీఓ సూర్యనారాయణ వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube