నాజర్తమిళ సీనియర్ నటుడు.కానీ తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ సహా పలు భాషల్లో నటించి చక్కటి గుర్తింపు పొందాడు.
ఎన్నో సినిమాల్లో నెగెటివ్ రోల్స్ పోషించాడు.పాజిటివ్ రోల్స్ లోనూ నటించి మెప్పించాడు.
తాజా బాహుబలి సినిమాలో అదరగొట్టాడు.భల్లాల దేవుడి తండ్రి, శివగామి భర్తగా బిజ్జల దేవుడి పాత్రలో జీవించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు.
నాజర్ నటనా జీవితంలో ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నాడు.ఉత్తమ నటుడిగా, ఉత్తమ విలన్ గా, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో ప్రశంసలు పొందాడు.ఎన్ని గౌరవాలు వచ్చినా తనకు లభించిన చెప్పు బహుమతి జీవితంలో మరువలేనిది అంటాడు నాజర్.ఇంతకీ ఆ చెప్పు కథ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కోకిల సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ విలక్షణమైన నటుడు క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన సినిమా నాయకన్.ఈ సినిమాలో కమల్ హసన్ హీరోగా చేసాడు.ఈ పాత్రతో ఆయన ఎంతో గుర్తింపు పొందారు.అదే సినిమాలోఅసిస్టెంట్ కమిషనర్ పాటిల్ పాత్రలో నాజర్ నటించాడు.
ఈ క్యారెక్టర్ చేసిన ఆయనకు కమల్ కంటే ఎక్కువ పేరు వచ్చింది.ఏ మాత్రం జాలి, దయ, మానవత్వం లేని క్రూర పోలీసు క్యారెక్టర్ లో నాజర్ నటించాడు.
ఈ సినిమా చూసిన ఓ సున్నిత మనస్కుడు నాజర్ కర్కశత్వానికి చలియించి పోయాడు.ఒకసారి నాజర్ కారులో వెళ్తుండగా చూసి చెప్పును గిప్ట్ గా ఇచ్చాడు.
తనకు వచ్చిన మెమోంటోల మధ్యన ఈ చెప్పును కూడా ఉంచాడు.తన క్యారెక్టర్ జనాల మీద ఎంత ప్రభావం చూపిందో చెప్పడానికి ఈ బహుమతి నిదర్శనం అంటాడు నాజర్.ఎవరు ఎన్ని బహుమతులు ఇచ్చినా ఈ చెప్పు కిందికి సరిరావు అని చెప్పాడు తను.తన జీవితంలో అన్నింటికన్నా ఉత్తమమైన బహుమానం చెప్పు అంటాడు నాజర్.