సూర్యాపేట జిల్లా:మునగాల మండలం మొద్దులచెరువు సమీపంలో హైదరాబాద్- విజయవాడ 65వ,జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కొలతరాయిని, రోడ్డు పక్కన నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఘటనలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్త, ఇద్దరు పిల్లలు గాయపడ్డారు.ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.సూర్యాపేట వైపు నుండి కోదాడ వైపు వెళుతున్న కారు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.







