సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ సర్కిల్ పరిధిలోని పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లలో జరిగే దొంగ తనాలపై ఆటో క్యాన్వాసింగ్ ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు తెలిపారు.సర్కిల్ పరిధిలోని ఎస్ఐలతో సమావేశమై దొంగతనాల కట్టడికి, దొంగలబారి నుంచి తమ ఇండ్లను కాపాడుకోవడానికి ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాత్రి ఆరుబయట నిద్రించేటప్పుడు మీ ఒంటిపై విలువైన ఆభరణాలను ధరించవద్దని,ఇంటిలో విలువైన వస్తువులు, ఆభరణాలు,నగదు ఉంచవద్దని,వాటిని బ్యాంక్ లాకర్లో లేదా భద్రమైన చోట దాచుకోవడం ఉత్తమమన్నారు.ఊర్లకు వెళ్లేవారు పక్కింటివారికి లేదా పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు.
ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ ఎస్ఐ ముత్తయ్య, మఠంపల్లి ఎస్ఐ బాబు, గరిడేపల్లి ఎస్ఐ నరేష్, నేరేడుచర్ల ఎస్ఐ రవీంద్ర నాయక్,పాలకవీడు ఎస్ఐ లక్ష్మీనర్సయ్య పాల్గొన్నారు.







