సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ పట్టణంలో మీ సేవ సర్వర్లు మొరాయిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాస్ దరఖాస్తుదారులకు మరియు ఓబిఎంఎంఎస్
సేవలకు తీవ్ర అంతరాయం కలగడంతో దరఖాస్తుదారులు మీసేవ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.రేపటి నుండి ప్రభుత్వ కార్యాలయలకు వరుస సెలవులు ఉండటంతో దరఖాస్తు సమయం దగ్గర పడుతుందని ఆందోళన చెందుతున్నారు.







