ఇంటర్ ప్రశ్నాపత్రాల లీకేజీ పునరావృత్తం కాకుండా చూడాలి: బీఎ

సూర్యాపేట జిల్లా:త ప్రభుత్వం ఇంటర్ ప్రశ్నాపత్రాలలో చేసిన తప్పులు ఈ ప్రభుత్వంలో జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి రాపోలు నవీన్ కుమార్ ( Rapolu Naveen Kumar )అన్నారు.ఆదివారం సూర్యపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు జిలకర రామస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న జరిగే ఇంటర్ పరీక్ష పేపర్ లీకేజీలు( Inter exam paper leakages ) లేకుండా సజావుగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 Leakage Of Inter Question Papers Should Be Avoided Again: Ba-TeluguStop.com

గత ప్రభుత్వం ప్రశ్నాపత్రాలలో తప్పులతో పాటు అనేక పొరపాట్ల చేసి విద్యార్థుల ప్రాణాలు బలి తీసుకున్నదని మండిపడ్డారు.ప్రైవేట్ కళాశాలలో ఆర్థికంగా వెనుకబడి చదువుతున్న ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ అగ్రవర్ణ పేదల పట్ల అక్రమంగా అధికంగా ఫీజులు వసూలు చేసి ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు( BSP leaders ),కార్యకర్తలు పాల్గొన్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube